ఈ యాచకురాలు గుర్తుందా? ఈమె జీవితం మళ్లీ మొదటికొచ్చింది!

కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో ఎవరికీ తెలియదు.ఎవరి జీవితమైనా కాలమే నిర్ణయిస్తుంది.

 Ranu Mandal, Ranaghat Railway Station, Lata Mangeshkar Song, Posting On Netflix,-TeluguStop.com

దానికనుగుణంగా జీవిస్తూ ఉండడం మాత్రమే మానవ నైజం.అదృష్టం కలిసి వస్తే ఒక్కసారిగా మన తలరాత మారిపోతుంది.

రాత్రికి రాత్రే కోటీశ్వరుడు గా మారుతూ ఉంటారు.కొందరు కోట్లకు పడగలెత్తిన కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు.

అలా అదృష్టంతో మొదలైనదే రాను మండల్ జీవితం.ఈమె ఒక్కసారిగా ఎంత పాపులర్ అయిందో దేశమంతా చూసింది.

అలాంటి రాను మండల్ కితిరిగి పూర్వ జీవితం రాబోతోందా? మరీ తన కష్టాల కడలిలో తన జీవితం ఈ దాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.

రానఘాట్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక యాచకురాలు గా తన జీవితం సాగిస్తూ ఉండే రాను మండల్ ఒకరోజు రైలులో లతా మంగేష్కర్ పాడిన ఓ పాటను పాడుతూ బిక్షాటన చేస్తూ.

ఉండగా ఓ ప్రయాణికుడు వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో .ఒక్కసారిగా ఆమె దశ మారిపోయింది.ఒక్కరోజులోనే ఆమెకు బాలీవుడ్ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయి.బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా కూడా తన సినిమాలో కంపోజ్ చేసిన పాట“తేరి మేరి కహానీ”అనే పాటను స్వయంగా రాను మండల్ తో పాడించడం తో ఆ పాట ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది.

ఈ పాటతో రాను మండల్ జీవితంలో ఊహించని మలుపు తిరిగింది.పెద్ద పెద్ద బంగ్లా, కార్లు ఆమె ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడడం ఇలా ఎన్నో ఊహించని విధంగా ఆమె జీవితం మారింది.

ప్రస్తుతం కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఎంతోమంది పెద్ద పెద్ద వారికి అవకాశాలు రావడం లేదు.అయితే రాను మండల్ పరిస్థితి కూడా అదేవిధంగా మారిపోయింది ఒక్క అవకాశం కూడా రాలేదు.

చేతిలో చిల్లిగవ్వ లేక పోయేసరికి రాను మండల్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.ఎంత ఎదిగిన అంతే ఒదిగి ఉండాలని పెద్దలు అంటుంటారు.రాత్రికి రాత్రి స్టార్ గా మారిపోయిన ఈ రాను మండల్ ఓ అభిమాని సెల్ఫీ అడిగితే అతనిపై ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆమెకు ఒక గుణపాఠంల మారిందని నెటిజన్లు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube