హాస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉంటే ఈ జాగ్రత్తలు పాటించండి  

Remember These Things Before Masturbating -

హస్తప్రయోగం చాలా మంచి అలవాటు.ఈ జెనరేషన్ కానివాళ్ళకి నచ్చకపోవచ్చు, మతపెద్దలు అసహ్యించుకోవచ్చు కాని, సైన్స్ గురించి నాలుగు ముక్కలు తెలిసినా హస్తప్రయోగం ఎంత ఉపయోగకరమైన అలవాటు మీకు అర్థం అవుతుంది.

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

TeluguStop.com - Remember These Things Before Masturbating-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

హస్తప్రయోగం వలన ఆక్సిటాసిన్ విడుదల అవుతుంది, మనసుకి ప్రశాంతత లభిస్తుంది, ఒంటికి నిద్ర లభిస్తుంది, లిబిడో పెరుగుతుంది, ఆరోగ్యకరమైన వీర్య ఉత్పత్తి జరుగుతుంది, పీరియడ్స్ లో నొప్పులు తగ్గుతాయి, కాలరీలు ఖర్చవుతాయి, సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది .ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టు రాయాలి.

ఇన్ని లాభాలున్నాయి కాబట్టి హస్తప్రయోగం మంచిదే.హస్తప్రయోగం వలన శరీరానికి ఎలాంటి హాని కలగకపోవచ్చు, కాని హాస్తప్రయోగం చేసుకునే పద్ధతుల వలన మనమే మన శరీరాన్ని బాధపెట్టవచ్చు.

హస్తప్రయోగం కూడా ఓ కళే.దాన్ని ఎలా చేయాలో, అలానే చేయాలి, లేదంటే ప్రమాదాలు తప్పవు.భావప్రాప్తి పొందడానికి హస్తప్రయోగం మంచి మార్గం .కాని హస్తప్రయోగం చేసుకోవడానికి ముందు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి, కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి .అవేంటో చూడండి.

1) అమ్మాయిలు .రిస్క్ వద్దు

అమ్మాయిలు సాధ్యమైనంత వరకు సెక్స్ టాయ్స్ వాడకపోవడమే మంచిది.హానికరమైన ప్లాస్టిక్ తో తయారయ్యే సెక్స్ టాయ్స్ యోని లోపలి చర్మంపై తన ప్రభావం చూపించవచ్చు.

సరిగా మెయింటేన్ చేయని సెక్స్ టాయ్స్ తో ఇంఫెక్షన్స్ కి గురయినా అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు.లూబ్రికేషన్ కోసం అమ్మాయిలు రకరకాల లూబ్రికెంట్స్ వాడతారు.వీటిలో కూడా కెమికల్స్‌ కలిసి ఉంటాయి.కాబట్టి నేచురల్ గా లూబ్రికేట్ అయ్యేంత ప్రేరణ దొరికితే, లేదా ఆంతలా కామోద్రేకం పొందితే, ఇలాంటి సమయాల్లో మార్కేట్లో దొరికే లూబ్రికేంట్స్ అవసరం ఉండవు కాబట్టి, ఆ హాస్తప్రయోగం వలన ఎలాంటి ప్రమాదం ఉండదు.

కాని ఫోర్స్డ్ గా లూబ్రికేషన్ కోసం బయటి లూబ్రికేషన్ వస్తువులు యోనిమీద ప్రయోగించడం కొంచెం రిస్కీ వ్యవహారమే.

ఇక స్త్రీలు హస్తప్రయోగం కోసం తమ చేతులని ఉపయోగిస్తేనే మంచిదని కూడా డాక్టర్స్ సూచిస్తున్నారు.

రకరకాల ప్రయోగాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు.కాబట్టి థ్రిల్ కోసం లేనిపోని వస్తువులు వాడకూడదు.

చేతివేళ్ళతో చేసుకునే హస్తప్రయోగమే సేఫ్ .కాని చేతులు శుభ్రపరుచుకోనే పని మొదలుపెట్టాలి.ఎందుకంటే ఎప్పుడూ మీ చేతుల్లో బ్యాక్టీరియా ఉంటూనే ఉంటుంది.2) పురుషాంగం ఫ్రాక్చర్

హస్తప్రయోగం వలన STDs వ్యాపించవు, అసలు ఎవరికి ఇంతవరకు హస్తప్రయోగం వలన STD సోకినట్లుగా వినలేదు మనం .ఈరకంగా చూసుకుంటే సెక్స్ కన్నా హస్తప్రయోగం చాలా సురక్షితమైనదే.అంతమాత్రాన హస్తప్రయోగం పూర్తిగా సురక్షితం అని చెప్పలేం.

హస్తప్రయోగం వలన పురుషాంగం ఫ్రాక్చర్ కావచ్చు తెలుసా? అదేంటి అంగంలో ఎముకలే లేనప్పుడు ఫ్రాక్చర్ ఎలా అవుతుంది అని మీరంతా ఆశ్చర్యపోవచ్చు కాని, స్తంభించిన అంగాన్ని రఫ్ గా హ్యాండిల్ చేస్తే అదే జరిగేది.సెక్స్ చేస్తున్నప్పుడు, కౌగర్ల్ లేదా రివర్స్ కౌగర్ల్ సెక్స్ పొజీషన్ లో పురుషాంగం ఎలాంటి రిస్క్ లో అయితే ఉంటుందో, హస్తప్రయోగం రఫ్ గా చేస్తున్నప్పుడు కూడా ఇంచుమించు అలాంటి ప్రమాదంలోనే ఉంటుంది.

కేవలం అమ్మాయిలే కాదుగా, హస్తప్రయోగంలో అబ్బాయిలు కూడా కొన్ని ప్రయోగాలు చేస్తారు .ఆ క్రేజీ ప్రయోగాలే ఫ్రాక్చర్ ని తెచ్చిపెడతాయి.కాబట్టి హస్తప్రయోగం చాలా కేర్ ఫుల్ గా చేయండి అబ్బాయిలు.సింపుల్ గా చెప్పాలంటే జెంటిల్ గా చేయాలి.3) హస్తప్రయోగం సెక్స్ అంత లాభకరము కాదు

మనం తప్పుగా చేస్తే తప్ప హస్తప్రయోగం వలన ఎలాంటి నష్టాలు ఉండకపోవచ్చు కాని, హస్తప్రయోగం సెక్స్ అంత లాభకరం మాత్రం కానే కాదు.ప్రతీ భావప్రాప్తి ఒకేలా ఉండదు.

హస్తప్రయోగానికి వచ్చే భావప్రాప్తి, సెక్స్ లో వచ్చే భావప్రాప్తి ఒకేలా ఉండుంటే, అసలు ఎవరు శృంగారం చేసేవారు కదా.సెక్స్ లో లభించే హాయికి, హస్తప్రయోగంలో దొరికే హాయికి ఇంటర్నేషనల్ క్రికెటర్, గల్లి క్రికేటర్ కి ఉన్నంత తేడా ఉంటుంది.కాబట్టి, ఎప్పుడూ కూడా హస్తప్రయోగాన్ని సెక్స్‌ మీద రేట్ చేయొద్దు.సెక్స్ లో మనం ఖర్చు చేసేంత కాలరీలు, హాస్తప్రయోగంలో ఖర్చు చేయలేం కూడా.హస్తప్రయోగంలో నిమిషానికి ఆరు కాలరీలు మాత్రమే ఖర్చు అవుతాయి.అందుకే హస్తప్రయోగం ఎప్పటికి సెక్స్ ని మ్యాచ్ చేయలేదు.

సెక్స్ బ్లడ్ ప్రెషర్, ప్రొస్టేటు, గుండెకి మేలు చేస్తుంది.మరి.హస్తప్రయోగం? నష్టమైతే చేకూర్చదు కాని, సెక్స్ చేసే ఈ సహాయం హస్తప్రయోగం చేయలేదు.అయితే కొద్దివరకు హస్తప్రయోగం ప్రొస్టేటుని సురక్షితంగా ఉంచుతుందని, క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.4) హస్తప్రయోగం మిమ్మల్ని చంపగలదు

రఫ్ హస్తప్రయోగం అలవాటు వలన స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి, చివరకి స్కిన్ క్యాన్సర్ తో చనిపోయాడు ఒక జపాన్ యువకుడు.కూల్ డ్రింక్ సీసాతో హస్తప్రయోగం చేసి, ఆ బాటిల్ విరిగిపోయి ప్రాణాల మీదకి కొనితెచ్చుకుంది ఓ అమెరికన్ టీనేజర్.వ్యాక్యూం క్లీనర్ తో హస్తప్రయోగం చేసుకునే ప్రయత్నం చేసి 57 ఏళ్ళ పురుషుడు ఇదే అమెరికాలో చనిపోయాడు.2009 లో నికోలా అనే అమ్మాయి, హస్తప్రయోగం చేసుకుంటూ, పట్టరాని కామోద్రేకంలో, గుండె ఆగి చనిపోయిందట.డాక్టర్లు కూడా ఈ కేసు చూసి షాక్ కి గురయ్యారు.ఒక్కరాత్రిలో 14-15 సార్లు హస్తప్రయోగం చేసుకోని ప్రాణం వదిలేసిన అబ్బాయి కూడా ఉన్నాడు.

ఇవన్నీ చూస్తే, అసలు హస్తప్రయోగం అంటేనే భయమేస్తోందా? రోజుకి వేలమంది యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారని, బండి నడపటం మానేయలేం కదా .ఇదీ అంతే .అలాంటి వికృత చర్యలు చేయకుండా సింపుల్‌గానే పని కానియ్యాలి.5) హస్తప్రయోగం ఒక వ్యసనం

ఎలాగైతే మద్యపానం, ధూమపానం వ్యసనంగా మారతాయో, హస్తప్రయోగం కూడా ఒక వ్యసనంగా మారవచ్చు.ఇలా చాలామందికి జరుగుతుంది.ఈ సమస్య ఉన్నవారు గంట – రెండు గంటల వ్యవధిలో ఒక్కసారైనా హస్తప్రయోగం చేసుకోవాలని తహతహలాడుతుంటారు.లేదంటే వారి మనసు ఇక్కడ ఉండదు.ఆ సమయంలో ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు .హస్తప్రయోగం చేసుకునే అవకాశం దొరక్కపోతే తట్టుకోలేరు .పిచ్చిపట్టినట్టుగా అనిపిస్తుంది.

ఇలాంటి కేసులతో పాటు మరోరకమైన కేసులు ఉంటాయి .విచిత్రంగా హస్తప్రయోగానికి ఎంతలా అలవాటు పడతారంటే, వీరికి సెక్స్ చేయడం ఇష్టంవుండదు.నమ్మినా నమ్మకున్నా, ఇలాంటి భర్తలతో నరకం అనుభవిస్తున్న స్త్రీలు ఉన్నారు.తమని తాము ప్రేరేపించుకుంటే తప్ప, వీరికి సుఖంగా అనిపించదు.హస్తప్రయోగం వ్యసనంగా మారితే, అది రోజువారి పనులకి ఆటంకంగా మారుతుంది.నలుగురితో కలిసి ఉండలేం, మనసు పెట్టి పని చేయలేం .ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎందుకు? హస్తప్రయోగానికి ఎప్పటికీ అతిగా అలవాటు పడొద్దు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Remember These Things Before Masturbating Related Telugu News,Photos/Pics,Images..