నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

సాధారణంగా కొందరు ఈ విధమైనటువంటి విషయాలను కొట్టిపారేస్తారు కానీ నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అనేది పెద్దల సామెత.ఒకరిపై నరదృష్టి పడిందంటే వారికి జీవితంలో కోలుకోలేని దెబ్బ పడుతుందని అర్థం.

 Remedies And Prevention Of Nara Dishti Nara Dishti, Amavasya, Pumpkin, Lemon , C-TeluguStop.com

సాధారణంగా ఒకరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే ఇతరులు ఆ విషయాన్ని ఓర్చు కోలేరు.ఈ క్రమంలోనే ఆ కుటుంబంపై ఇతరులు చెడు దృష్టితో చూడటం లేదా వారికి చెడు కలగాలని భావించడం, మరి కొందరు వారిపై చెడు ప్రయోగాలు చేయడం వంటివి చేస్తుంటారు.

మరి ఈ విధమైనటువంటి నరదృష్టి మన ఇంటి పై పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.మరి ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఒకరి చెడు దృష్టి మనపై పడకుండా ఉండాలంటే ముందుగా మనం మన గురించి ఏ విధమైనటువంటి పొగడ్తలను చెప్పకూడదు.మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం చేత ఎవరి ప్రభావం మనపై పడదు.

లేనిపోనివి చెబుతూ గొప్పలు చెప్పుకోవడం వల్ల ఇతరులకు మన పై చెడు ప్రభావం ఏర్పడుతుంది.ఇలా చెడు దృష్టి మనపై పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన ఇంటి ప్రధాన ద్వారం ముందు కనుదిష్టి వినాయకుడిని ఫోటోను పెట్టాలి.

అదే విధంగా ప్రతి అమావాస్య రోజు మన ఇంటికి దిష్టి తీసి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయను, లేదా గుమ్మడికాయను బద్దలు కొట్టాలి.

Telugu Amavasya, Lemon, Dishti, Pumpkin, Sambrani-Telugu Bhakthi

అదేవిధంగా అమావాస్య రోజు 5 పచ్చిమిరపకాయలను ఒక నిమ్మకాయ చిన్న బొగ్గును దారానికి కట్టి కనుదిష్టి వినాయకుడు ఫోటో కింద కట్టడంవల్ల మనపై ఏ విధమైనటువంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది.అయితే ప్రతి అమావాస్యకు ఇది మారుస్తూ పూజ చేయాలి.అలాగే మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద బూడిద గుమ్మడికాయ ఉంచటం వల్ల మన ఇంటి పై ఏర్పడేటటువంటి చెడు ప్రభావాన్ని గుమ్మడికాయ గ్రహిస్తుంది.

అలాగే మనం పూజ అనంతరం కొద్దిగా నిప్పులపై సాంబ్రాణి పొగ వేయటం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.ఈ విధమైనటువంటి చిట్కాలు పాటించడం ద్వారా మన ఇంటి పై ఏలాంటి నరదృష్టి ఉండదనీ పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube