కరోనా కు మరో మందు రెడీ... ధర కూడా తక్కువే...!

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇకపోతే కరోనా వైరస్ విరుగుడు కనుగొనేందుకు ప్రపంచం లోని అనేక మంది సైంటిస్టులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.

 Corona Virus, Scientists, Koviphar, Hetero, Mylan, Remdesivir, Drug Control Gene-TeluguStop.com

ఈ ప్రయోగాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కో మందు ఉపయోగపడుతుందని రోజు ఏదో ఒక విషయం వింటూనే ఉన్నాం.తాజాగా కరోనా వైరస్ కు విరుగుడు గా రెమ్‌డెసివిర్ మందు బాగా పని చేయడంతో ఇప్పుడు ఫార్మా కంపెనీలన్నీ దాన్ని ఉపయోగించడడమే కాకుండా, వాటికి సరికొత్త బ్రాండ్ పేర్లతో కరోనా కి మందు లు తయారు చేయడం మొదలు పెట్టారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు మందులు బయట మార్కెట్లో లభ్యమవుతుండగా తాజాగా అంతర్జాతీయ ఫార్మా కంపెనీ మైలాన్ భారతదేశంలో వారి మందును తీసుకు వచ్చింది.

ఇందుకు సంబంధించిన ధర చూస్తే 100 ఎంజి వయల్‌ ను రూ.4,500 కు అమ్ముతున్నట్లు తెలుస్తోంది.ఈ ఇంజక్షన్ అన్ని రకాల వయసు వారు వాడవచ్చని కంపెనీ తెలియజేస్తుంది.

ఎవరికైనా కరోనా వచ్చిన సమయంలో వారికి వైరల్ డ్రగ్ గా దీన్ని తీసుకోవచ్చని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా ఇచ్చింది.ఇక దీంతో దేశంలోని ఫార్మా కంపెనీలు రెమ్‌డెసివిర్ వారితో కలిసి వారి ఉత్పత్తులను తయారు చేసేందుకు ముందుకు తీసుకవెళుతున్నాయి.

ఇందుకు సంబంధించి తొలి బ్యాచ్ ఇప్పటికే మార్కెట్లోకి రిలీజ్ చేసింది మైలాన్.ప్రస్తుతం భారతదేశంలో ఒక్కో హెటెరో తన డ్రగ్ ను రూ.5400 అమ్ముతుండగా అది కాస్త బ్లాక్ మార్కెట్ లో ఏకంగా రూ.30 వేలు పలుకుతోంది.అయితే డిమాండ్ కు తగ్గట్టు భారీగా ఈ మందును సప్లై చేస్తామని మైలాన్ సంస్థ తెలుపుతోంది.

ఇందుకు సంబంధించి హెటెరో కంపెనీ కోవిఫర్ అనే పేరుతో రెమ్‌డెసివిర్ మందును మార్కెట్లోకి తీసుకు రాగా, సిప్లా కంపెనీ సిప్రెమీ అనే పేరుతో మార్కెట్లోకి తీసుకు వచ్చింది.

ఈ రెండు మందులు ప్రస్తుతం భారతదేశంలో బయట దొరకడం కంటే బ్లాక్ మార్కెట్ లోనే ఎక్కువగా కనబడుతోంది.ఇందుకోసం ఏకంగా నాలుగైదు రెట్లు వాటి ధరను పెంచి విక్రయిస్తున్నారు.

ఇక ప్రస్తుతం మైలాన్ కంపెనీ కి సంబంధించిన మందు కూడా వచ్చింది కాబట్టి కొంత వరకు ఈ బ్లాక్ మార్కెట్ ధరకు చెక్కు పెట్టే విధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube