ప్రియాంక కేసులో నిందితులకి 14 రోజుల రిమాండ్

ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో దొరికిన నిందితులని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచగా, అక్కడికి భారీ ఎత్తున ప్రజలు తరలి వెళ్లి ఆందోళన చేశారు.వాళ్ళని స్టేషన్ నుంచి బయటకి తీసుకొస్తే చంపేస్తాం అనేంతగా ఆగ్రహంతో ప్రజలు కట్టలు తెంచుకున్నారు.

 Remand Priyank-TeluguStop.com

కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలని తరుచుగా చూస్తూ ఉండటంతో ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకున్న పోలీసులు వారిని కోర్టుకి తీసుకెళ్లలేకపోయారు.దీంతో మండల మేజిస్ట్రేట్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారణ చేయించారు.

మండల మెజిస్ట్రేట్ పాండునాయక్‌, డాక్టర్లు నేరుగా షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వైద్య పరీక్షల అనంతరం నిందితులను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.వారికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నట్లు తెలిపారు.

ఈ నేపధ్యంలో నిందితులని కట్టుదిట్టమైన భద్రత నడుమ చర్లపల్లి జైలుకు తరలించే ప్రయత్నం తరలించారు.నిందితులని తీసుకెళ్లడానికి ఏకంగా పది వాహనాలలో పోలీసులు బందోబస్తుతో వారిని జైలుకి తరలించారు.

మరో వైపు ఈ కేసు విచారణకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారిని త్వరగా ఉరితీయాలని ప్రజా సంఘాలు, మహిళలు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.ఇక ప్రియాంక కుటుంబానికి ప్రజా నాయకులు అందరూ బాసటగా నిలబడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube