జాను : సీనియర్‌ ముందు తేలిపోయిన జూనియర్‌

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.తమిళ వర్షన్‌ను ఉన్నది ఉన్నట్లుగా దించేయబోతున్నట్లుగా టీజర్‌ను చూస్తుంటేనే అర్థం అవుతుంది.

 Remake Janu Sarvanand Samantha Vijay Sethupathy Trisha Tollywood Gossips 96 Rem-TeluguStop.com

దాదాపుగా 95 శాతం సీన్స్‌ను ఉన్నది ఉన్నట్లుగా తీసుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు స్వయంగా చెబుతున్నారు.తమిళ వర్షన్‌లో విజయ్‌ సేతుపతి మరియు త్రిషలు నటించిన విషయం తెల్సిందే.

ఇక తెలుగు వర్షన్‌లో శర్వానంద్‌ మరియు సమంతలు నటించారు.

టీజర్‌ విడుదల అయిన తర్వాత పోలికలు మొదలు అయ్యాయి.

విజయ్‌ సేతుపతి స్థాయిలో శర్వానంద్‌ ఈ చిత్రంలో నటించగలడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.గతంలో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రంలో శర్వానంద్‌ కనబర్చిన నటన అద్బుతం.

ఆ స్థాయిలో ఈ రీమేక్‌లో కూడా కనబర్చితే చాలు.ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లుగా అవుతుంది.

శర్వానంద్‌ లుక్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది.కాని సమంత విషయంలో మాత్రం విమర్శలు వస్తున్నాయి.

Telugu Janu, Samantha, Sarvanand, Trisha-

96 మూవీ అనగానే త్రిష గుర్తుకు వస్తుంది.ఒక సింపుల్‌ కాస్ట్యూమ్‌లో ఆమె కనిపించిన విషయం తెల్సిందే.సమంత కూడా అచ్చు అలాంటి కాస్ట్యూమ్స్‌తోనే కనిపించబోతుంది.కాని త్రిష స్థాయిలో మాత్రం ఆకట్టుకోవడంలో విఫలం అవుతుందని అంటున్నారు.త్రిషను చూసిన ఈ కళ్లతో సమంతను చూడటం కష్టంగా ఉందంటున్నారు.96 చిత్రం గురించి అస్సలు తెలియని వారికి అందులో త్రిష ను చూడని వారికి సమంత ఖచ్చితంగా నచ్చుతుంది.కాని ఇప్పుడు మాత్రం సీనియర్‌ త్రిష ముందు సమంత తేలిపోయిందని చెప్పక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube