పవన్ కి ఇది కొత్తేమి కాదు

వేదాలం రీమేక్ అనే వార్త వినగానే పవన్ ఫ్యాన్స్ లో ఎక్కడో అసంతృప్తి .అసలే రీమేక్ సినిమా, మళ్ళి అది ఎన్టీఆర్ ఉసరవెల్లిని పోలి ఉంటుంది అని మూలుగుతున్న పవర్ స్టార్ అభిమానుల మీద, సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు అనగానే తాటికాయ పడినంత పని అయ్యింది.

 Remake And Young Director … Not A New Game For Pawan Kalyan-TeluguStop.com

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి బాబి లాంటి పెద్దగా అనుభవం లేని డైరెక్టర్ నే తీసుకున్నా, అది గబ్బర్ సింగ్ బ్రాండ్ తో వస్తున్న సినిమా కావడం, కథ కన్నా క్యారేక్టరైజేషన్ ముఖ్యం కావడం,గబ్బర్ సింగ్ ఆల్రేడి జనాలకి నచ్చిన పాత్ర కావడంతో పెద్దగా భయపడట్లేదు పవన్ ఫ్యాన్స్.బాబి,ఎస్ జే సూర్య,సంతోష్ శ్రీనివాస్ .ఈ లైనప్ చూసి పవన్ ఫ్యాన్స్ కి చెమటలు పడుతున్నా, ఇది పవన్ కి కొత్తేమి కాదు.

పవన్ తన కెరీర్లో అగ్రదర్శకులతో కన్నా అనుభవం తక్కువున్న దర్శకులతోనే ఎక్కువగా పనిచేసాడు.

తొలిప్రేమ తీసిన కరుణాకరన్ అయితేనేమి,తమ్ముడు తీసిన అరుణ్ ప్రసాద్,బద్రి తీసిన పూరి జగన్నాథ్ , ఖుషి తీసిన ఎస్ జే సూర్య అయితేనేమి .పవన్ తో సినిమా తీసినప్పుడు వారికి పెద్దగా అనుభవం లేదు.పవన్ కెరీర్ లో రీమేక్ సినిమాలతో హిట్లు కొట్టినా, ఎప్పుడు అగ్ర దర్శకుల వెంట పడలేదు.రీమేక్ సినిమా,యువ దర్శకుడు .ఇవేమీ పవన్ కి కొత్త కాదు.

అందుకే పవన్ ఫ్యాన్స్ పెద్దగా భయపడాల్సిన పని లేదు.

వారు చేయాల్సిదంతా సంతోష్ సినిమా బాగా తీయాలని, వేదాలం కన్నా దాని రిమేక్ బాగా రావాలని కోరుకోవడమే.ఏప్రిల్ లో ఈ సినిమా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube