'సుకుమార్'లా ఆలోచిస్తే.. ఇండస్ట్రీ మరోలా ఉండేది?

టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.రచయితగా కూడా మంచి సినిమాలను అందించాడు సుకుమార్.

 Remaining Big Shots Should Think Like Sukumar Sukumar, Tollywood, Think Like Suk-TeluguStop.com

ఈయన దర్శకత్వంలో స్టార్ హీరోలు నటించి మంచి సక్సెస్ ను అందుకున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

తాజాగా సుకుమార్ తన వంతు సహాయం తో ముందుకు రాగా తనలా ఆలోచిస్తే మరింత బాగుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి మరింత దారుణంగా ఉండటంతో.

ఈ కష్ట సమయంలో ఆక్సిజన్ కొరత మరింత కష్టంగా మారింది.దీంతో సరైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు.

వైద్యులు తమ వంతు కృషి చేస్తున్నా కూడా ఆక్సిజన్ కొరత వల్ల ప్రాణాలు పోతున్నాయి.ఇక రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండటంతోఆక్సిజన్ ప్లాంట్స్ సరిపోవటం లేదు.

ఈ నేపథ్యంలో కొందరు తమ వంతు సహాయం తో ఆక్సిజన్ ను సమకూర్చడానికి ముందుకు వస్తున్నారు.

Telugu Corona Wave, Sukumar, Tollywood-Movie

ఇక తాజాగా సుకుమార్ కూడా ఆక్సిజన్ కొరత విషయంలో ముందుకి రాగా రాజోలు లోని ఓ వైద్యశాలకు 25 లక్షలతో ఆక్సిజన్ సమకూర్చాలని అనుకున్నారట.దీంతో డబ్బులు మొత్తాన్ని సేకరించగా.చివరి నిమిషాల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆక్సిజన్ తయారు చేసుకోవచ్చు కదా అని అనుకున్నాడట.

ఇక దీంతో ఆ 25 లక్షలకు కాస్త 15 లక్షలు కలిపి మొత్తం 40 లక్షలతో ఆస్పత్రికి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది.

మొత్తానికి సుకుమార్ ఆలోచించిన విధానం వల్ల హాస్పిటల్ కి ఆక్సిజన్ కొరత తీరడంతో చాలామంది ఆయనను మెచ్చుకుంటున్నారు.

ఈయనలా రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు ఆలోచిస్తే ఆస్పత్రులకు ఆక్సిజన్ వంటి కొరత ఉండదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈయన ఆలోచిస్తే ఇండస్ట్రీ కూడా మరోలా ఉంటుందని పలువురు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube