పాస్‌పోర్ట్‌ గందరగోళం.. ఓసీఐ కార్డుదారులకు ఊరట: అమెరికాలోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన

అమెరికాలోని ఇండియన్ ఎంబసీ… ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులకు ఊరటనిచ్చే మాట చెప్పింది.ఓసీఐ కార్డు కలిగివున్న భారతీయులు.

 relief Oci Card Holders Wont Need Old Passports Now For India Travel, Overseas C-TeluguStop.com

ఇకపై భారతదేశానికి ప్రయాణించేటప్పుడు తమతో పాటు పాత, కాలపరిమితి ముగిసిన పాస్‌పోర్టులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ప్రకటించింది.ఈ మేరకు ఇండియన్ ఎంబసీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలిపింది.

అయితే కొత్త పాస్‌పోర్ట్ మాత్రం వెంట వుండాలని పేర్కొంది.

అలాగే 20 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన వారు ఓసిఐ కార్డు పొందే గడువును భారత ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు కూడా ఇండియన్ ఎంబసీ తెలిపింది.2005 నుండి అమలులో ఉన్న ప్రస్తుత ఓసీఐ గైడ్‌లైన్స్ ప్రకారం, ఈ కార్డుదారులు 20 సంవత్సరాల వయస్సు వరకు లేదా 50 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత కొత్త పాస్‌పోర్ట్ పొందిన ప్రతిసారీ ఓసీఐ కార్డు తిరిగి జారీ చేయవలసి ఉంటుంది.అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో ఈ నిబంధనలో భారత ప్రభుత్వం స్పల్ప మార్పులు చేసింది.

కాగా గతేడాది కోవిడ్ నేపథ్యంలో భారత్‌ వచ్చేందుకు సిద్ధమైన కొందరు ఇండో అమెరికన్లకు అమెరికాలోని జాన్‌ఎఫ్‌ కెనడీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది.ఓవర్‌సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) కార్డు ద్వారా వారు స్వదేశానికి వచ్చేందుకు ప్రయాణమయ్యారు.

అయితే విమానం ఎక్కేముందు డాక్యుమెంట్ల పరిశీలన సందర్భంగా రద్దయిన పాత ఓసీఐ పాస్‌పోర్టు తీసుకురాలేదంటూ ఎయిర్‌ఇండియా అధికారులు వారిని అనుమతించలేదు.ఓసీఐ ప్రయాణికులు భారత్‌కు రావాలంటే తప్పనిసరిగా గతంలో రద్దు చేసిన పాత పాస్‌పోర్టు కూడా తమ వెంట తీసుకురావాలనేది కొత్త తాత్కాలిక నిబంధన.

కానీ దీని పట్ల చాలా మందికి అవగాహన లేదు.

దీంతో ఆ రోజున జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయానికి వచ్చిన వారంతా ఓసీఐ కార్డు వెంట తెచ్చుకున్నారు.

కానీ పాత పాస్‌పోర్టు తీసుకురాలేదు.ఈ క్రమంలో వారందరినీ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు.

అయితే వీరు ఇండియన్ ఎంబసీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.స్పందించిన అధికారులు మధ్యలో కలగజేసుకుని వారిని ఎయిర్‌ఇండియా విమానంలో వెళ్లేందుకు బోర్డింగ్‌ పాస్‌లు అందజేసేలా చేశారు.

పాస్‌పోర్టుల విషయంలో గందరగోళం నెలకొనడంతో ప్రవాసులు.ఈ నిబంధనను సవరించాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు వెసులుబాటు కల్పించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube