సెల్ఫీ కొట్టు గిఫ్ట్ పట్టు అంటున్న రిలయన్స్ ట్రెండ్స్..!

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఎంత ఘనంగా నిర్వహిస్తారో మన అందరికి తెలిసిందే.అయితే బతుకమ్మ పండగ సందర్భంగా రిలయన్స్ ట్రెండ్స్ వారు మీకొక అద్భుతమైన గిఫ్ట్స్ ను ఇవ్వాలనుకుంటున్నారు.

 Reliance Trends Offering Gifts For Bathukamma Festival Selfie Contest, Selfie Co-TeluguStop.com

అందుకోసం మీరు చేయవలిసిందల్లా ఒక్కటే మీరు బతుకమ్మతో కలిసి ఒక సెల్ఫీ దిగి పంపిస్తే సరిపోతుంది.ఇది ఒక సెల్ఫీ కాంటెస్ట్ అన్నమాట.

బతుకమ్మతో సెల్ఫీ పేరుతో నిర్వహించే కాంటెస్ట్ లో గెలిచినవారికి మొదటి బహుమతి కింద 1,500 రూపాయిల విలువైన గిఫ్ట్ అందించనుంది.అలాగే రెండో బహుమతి కింద 1000 రూపాయిల విలువైన గిఫ్ట్ కార్డ్ కూడా ఇవ్వనున్నారు.

మన భారత దేశంలో అభివృద్ధి దిశగా ఉన్నా కంపెనీలలో రిలయన్స్ ట్రెండ్స్ కూడా ఒకటి.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ఇలా రిలయన్స్ వారు సంప్రదాయ బతుకమ్మ పండగ సెల్ఫీ కాంటెస్ట్ ద్వారా వినియోగదారులకు మరింత దగ్గర అవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

చిన్న పట్టణాల్లో సైతం ఈ బతుకమ్మ సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.మీ అందరికి బతుకమ్మ అంటే ఏంటో తెలుసు కదా.రకరకాల పూలతో అందంగా అలంకరించిన పూల గుచ్ఛన్నే ఒక దేవతగా భావిస్తారు.అలాగే ఆడపడుచులంతా సంప్రదాయ వస్త్రాలు ధరించి ఒకచోట చేరి రంగరంగుల పూలతో, విభిన్న రకాలు అయిన పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు.

ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా చేర్చి తల మీద పెట్టుకుని ఊరేగిస్తూ ఆటపాటలతో పూజించి చివరికి చెరువుల్లో బతుకమ్మని నిమజ్ఞనం చేస్తారన్నమాట.

Telugu Discount, Gifts, Latest, Reliance Trends, Selfie Contest-Latest News - Te

ఈ పండగను పురస్కరించుకొని రిలయన్స్ వారు నిర్వహించే బతుకమ్మ సెల్ఫీ పోటీలో గౌరీ దేవిని పూజించే సమయంలో రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మతో కలిసి మీరు దిగిన సెల్ఫీని రిలయన్స్ ట్రెండ్స్ స్పెషల్ వారి వాట్సాప్ నంబర్‌ కు సెండ్ చేస్తే సరిపోతుంది.అలా పంపిన సెల్ఫీలలో ఎవరు పంపిన బతుకమ్మ అందంగా ఉంటుందో వారి ఫొటోకు ఫస్ట్ ప్రైజ్ కింద రూ.1,500 విలువైన బహుమతిని అందిస్తారు.రెండో బహుమతి కింద రూ.1000 విలువైన గిఫ్ట్ కార్డ్ అందించనున్నారు.అంతేకాదు.పోటీలో పాల్గొన్నవారికి డిస్కౌంట్ కూపన్ కూడా అందిస్తారు.మరి ఆలస్యం చేయకుండా త్వరగా పోటీలో పాల్గొని విలువైన బహుమతులను మీ సొంతం చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube