5జి విషయంలో కీలక ప్రకటన చేసిన రిలయన్స్ జియో..!

టెలికాం రంగంలో తన దైన శైలిలో ముందుకు దూసుకుని పోతుంది  రిలయన్స్ జియో.సరికొత్త ప్లాన్స్ తో ఎప్పటికప్పుడు వినియోగదారులను పెంచుకుంటూ లాభాల బాటలో అడుగులు వేస్తుంది జియో.తన ప్రత్యర్థి సంస్థలకు రోజుకో సవాలు విసురుతుంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.2021 డిసెంబర్ నాటికి జియో యూజర్ల సంఖ్య దేశంలో 42.1 కోట్లకు చెరింది అంటే 2020 తో పోలిస్తే దాదాపు కోటి మంది సబ్ స్క్రైబర్లు పెరిగారు.ఇదిలా ఉండగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 2021 మూడో క్వార్టర్ లో జియో రూ.3,795 కోట్ల నికర లాభం ఆర్జించిగా, గత సంవత్సరం ఈ కాలంలో రూ.3,486 కోట్ల లాభం వచ్చింది.అలాగే జియో ఇప్పుడు 5జీ నెట్ వర్క్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను  వెల్లడించింది.దేశంలో 1000 ప్రముఖ నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ కవరేజీని అందించేందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు జియో వెల్లడించింది.

 Re Iance Jio Makes Key Announcement On 5g 5g, Key Decision, Reliance, Jio, Bumpe-TeluguStop.com

ఇందుకోసం మౌలిక సదుపాయాలను సైతం ఏర్పరుచుకుంటోంది.ప్రస్తుతం జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అంటే ప్రతీ యూజర్ పై సగటు వచ్చే ఆదాయం రూ.151.6 కు పెరిగింది.అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇది 8.6% వృద్ధి చెందింది.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.జియో ప్రీపెయిడ్ రీచార్జ్ లను సులభతరం చేసేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం.

Telugu Bumper, Key, Reliance-Latest News - Telugu

Telugu Bumper, Key, Reliance-Latest News - Telugu

అది ఎలా అనుకుంటున్నారా అంటే.ఇకమీదట వాట్సాప్‌ ద్వారానే జియో రీచార్జ్ చేసుకునే సదుపాయం కలగచేస్తుంది.

అంతే కాకుండా యూపీఐ ద్వారా ఆటోమేటిక్ రీచార్జ్ సదుపాయాన్ని కూడా జియో ఇటీవల తీసుకొచ్చింది.అంటే ఇకమీదట మీ ప్లాన్ గడువు పూర్తి అయిన వెంటనే ఆటోమాటిక్ గా రీఛార్జ్ అవుతుంది అన్నమాట.ఇప్పటివరకు టెలికామ్ శాఖకు కట్టవలిసిన బకాయిలన్నిటిని జియో ఇటీవలే చెల్లించేసింది.2021 మార్చి వరకు వడ్డీతో కలిపి మొత్తంగా రూ.30,791కోట్లను డాట్ కు కట్టేసింది జియో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube