మరో అదిరిపోయే ఫీచర్ తో ముందుకొచ్చిన రిలయన్స్ జియో …!  

Jio Meet App, HD Video Calling, Jio New Feature, Reliance Jio HD Video Calling APP - Telugu Hd Video Calling, Jio Meet App, Jio New Feature, Reliance Jio Hd Video Calling App

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి అనేక సంచలనాలకు దారి తీసింది.అతి కొద్దికాలంలోనే దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా రిలయన్స్ జియో దూసుకుపోతుంది.

 Reliance Jio Hd Video Calling App Jio Meet

రిలయన్స్ జియో మార్కెట్ లోకి వచ్చిన తర్వాత సంవత్సరం రోజుల పాటు రిలయన్స్ జియో కస్టమర్ లకి ఉచిత సేవలు అందించిన సంగతి తెలిసిందే.అయితే ఆ తర్వాత క్రమక్రమంగా రీఛార్జ్ ప్లాన్ లను ఇస్తూ నాణ్యమైన సర్వీసు అందించడంతో చాలామంది రిలయన్స్ జియోకు పరిమితమై పోయారు.

ఇందుకు తగ్గట్టే రిలయన్స్ జియో కూడా ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో వారి కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తోంది.

మరో అదిరిపోయే ఫీచర్ తో ముందుకొచ్చిన రిలయన్స్ జియో …-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇకపోతే తాజాగా రిలయన్స్ జియో మరో సరికొత్త ఫీచర్లతో ప్రజల్ని ఆనంద పరచడానికి ఆవిష్కృతమైంది.

ఈసారి జియో మీట్ పేరుతో HD వీడియో కాన్ఫరెన్స్ యాప్ ను జియో సంస్థ ప్రవేశ పెట్టడం జరిగింది.ఇందులో ఏక కాలంలో దాదాపు 100 మంది యూజర్లు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోవచ్చు.

ఇకపోతే ప్రస్తుతం ఇది వ్యక్తిగతంగా, వృత్తి పరంగా అందుబాటులోకి వచ్చింది.ఇందుకు సంబంధించిన యాప్ ను ఆపిల్ ప్లే స్టోర్ లో, గూగుల్ ప్లేస్టోర్ లో డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు.

ఈ యాప్ ను చాలా సులువుగా యూజర్ ఫ్రెండ్లీ గా ఉండేలా జియో యాజమాన్యం దీనిని డిజైన్ చేశారు.ఇది ప్రత్యేకంగా పర్సనల్ చాటింగ్ మాత్రమే కాకుండా వ్యాపార సంస్థలకు సంబంధించిన మీటింగ్ లో కూడా ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది.కేవలం యాప్ మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే… మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ లాంటి వాటి ద్వారా కూడా ఈ యాప్ లో వీడియో కాన్ఫరెన్స్ జాయిన్ అవ్వచ్చు.దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సి అవసరం లేదు.

నీ స్నేహితులు సహ ఉద్యోగులు ఇంటి సభ్యులు ఎవరికైనా సరే ఉచితంగా అద్భుతమైన HD వీడియో కాలింగ్ తో మీరు ఎదుటివారితో సంభాషణ జరపవచ్చు.

#Jio Meet App #Jio New Feature

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Reliance Jio Hd Video Calling App Jio Meet Related Telugu News,Photos/Pics,Images..