ప్రజలకు శుభవార్త... తక్కువ ధరకే జియో స్మార్ట్ ఫోన్లు?

నాలుగేళ్ల క్రితం టెలీకాం రంగంలోకి అడుగు పెట్టిన జియో సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు.గతంలో ఒక జీబీ డేటా కోసం వంద రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉండగా జియో రాకతో డేటా ఛార్జీలు తగ్గాయి.

 Jio Low Cost Smart Phone Will Avaible 2021 January, Reliance Jio, Android Phones-TeluguStop.com

అపరిమిత కాల్స్ అంటూ మార్కెట్లోకి అడుగు పెట్టిన జియో వల్ల కాల్ ఛార్జీలు సైతం అమాంతం తగ్గాయి.అనంతరం 1500 రూపాయలకే ఫీచర్ ఫోన్ ను అందుబాటులొకి తెచ్చి జియో మరో సంచలనానికి తెర లేపింది.

తక్కువ కాలంలోని జియో కీలక నిర్ణయాలతో కోట్ల సంఖ్యలో వినియోగదారులను సొంతం చేసుకుంది. జియో ఫోన్లలో పాటు లైఫ్ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చిన జియో తాజాగా మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో మెజారిటీ వాటా సొంతమయ్యే విధంగా జియో అడుగులు వేస్తోంది.దాదాపు 10 కోట్ల స్మార్ట్ ఫోన్లను గూగుల్ ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫామ్ తో తయారు చేసేందుకు సిద్ధమవుతోంది.

యువతలో చాలామంది తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు.కొందరు ఇప్పటికే స్మార్ట్ ఫోన్ ఉన్నా తక్కువ ధరకే మరో స్మార్ట్ లభ్యమైతే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.కరోనా, లాక్ డౌన్ వల్ల ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో జియో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొని వస్తే కొనుగోళ్లు సైతం పెరిగే అవకాశం ఉంది.

2021 జనవరి నాటికి జియో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.4జీ, 5జీ స్మార్ట్ ఫోన్లను జియో అందుబాటులోకి తీసుకురానుంది.అయితే ఈ ఫోన్లు ఎంత ధరలో వస్తాయో తెలియాల్సి ఉంది.ఈ సంవత్సరం జులై నెలలో అల్ఫాబెట్ సంస్థ గూగుల్ రిలయన్స్ డిజిటల్ విభాగంలో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టబోతున్నట్టు ప్రకటించిన సంగతి విధితమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube