కరోనాతో మరణించిన ఉద్యోగి కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న రిలయన్స్..!

దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.నిత్యం లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

 Reliance Has Taken A Crucial Decision Regarding The Family Of The Employee Who D-TeluguStop.com

అయితే ఇటీవల కాలంలో భారీగా పెరిగిన కేసులు కాస్త కొంత తగ్గుముఖం పట్టాయి.కాగా మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో కరోనా మహమ్మారి కారణంగా నమోదవుతున్న మరణాల్లో 70 శాతానికి పైగా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.దేశంలో అత్యధికంగా మహారాష్ర్ట, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇటీవల పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నా మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.ఇకపోతే కరోనా పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు.

రోజురోజుకు అందరిని వెంటాడుతోంది.ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడుతూ మృత్యువాత పడుతున్నారు.

Telugu Caorna, Carona, Reliance-Latest News - Telugu

ఇక ఉద్యోగాలు చేసుకునేవారు కరోనా బారిన పడితే కుటుంబం గడవడం కష్టతరమవుతోంది.ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది.తమ ఉద్యోగుల పట్ల మానవత్వం చాటుకుంది.కరోనా మహమ్మారి సమయంలో రిలయన్స్‌ ఉద్యోగులకు అండగా నిలుస్తోంది.కరోనాతో మృతి చెందిన ఉద్యోగులకు ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని రిలయన్స్‌ తెలిపింది.కోవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగులకు చివరి నెల జీతం ఎంత తీసుకుంటారో అదే జీతం ఐదు సంవత్సరాల పాటు మృతుని కుటుంబానికి అందించనున్నట్లు వెల్లడించింది.

అంతేకాకుండా మరణించిన ఉద్యోగి పిల్లలకు విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపింది.కోవిడ్‌ బారిన పడిన మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.తమ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube