అంబానీ జగన్ కలయికలో ఆంతర్యం ఏమిటి పోలిటికల్ చర్చ

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని, కంపెనీలు పెట్టేందుకు ఎవరు ముందుకి రావడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.ఒక వర్గం మీడియా కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ జగన్ పాలన మీద దుష్ప్రచారం చేస్తుంది అనేది వైసీపీ వారి ఆరోపణలు.

 Reliance Chief Ambani Meets Ap Cm Jagan Mohan Reddy Telugustop-TeluguStop.com

అయితే ఈ రెండింటి సంగతి ఎలా ఉన్న కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి కలవడం జరిగింది.ఆ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు ఊహించని విధంగా ప్రపంచ కుబేరుడు, ఇండియా దిగ్గజ వ్యాపారవేత్త, ఇండియన్ మార్కెట్ ని శాసిస్తున్న కార్పోరేట్ కింగ్ ముఖేష్ అంబాని ముఖ్యమంత్రి జగన్ ని కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే వీరి కలయికపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం రిలయన్ అధినేత అని అప్పట్లో ఆరోపణలు చేసి వారికి సంబందించిన ఆస్తులని కూడా జగన్ సపోర్టర్స్ ద్వసం చేసారు.జగన్ కూడా అదే విషయం మీద కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేసారు.

అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆత్మీయంగా కలవడం ద్వారా రాజశేఖర్ రెడ్డి మరణంతో ముఖేష్ అంబానికి ఎలాంటి సంబంధం లేదని జగన్ ఒప్పుకున్నట్లేనా అంటూ వాదిస్తున్నారు.అయితే అంబానీ జగన్ కి కలవడానికి ఏపీలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమల స్థాపన కోసం అని చెబుతున్నారు.

అయితే ఈ కలయిక వేనున కేజీ బేసిన్ వ్యవహారం ఉందనే టాక్ కూడా ఉంది.అప్పట్లో ఈ కేజీ బేసిన్ నుంచి రిలయన్స్ తీస్తున్న గ్యాస్ విషయంలోనే రాజశేఖర్ రెడ్డికి అంబానీతో కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు వచ్చాయి.

మరోసారి జగన్ తో ఈ కేజీ బేసిన వ్యవహారంలో ఇబ్బంది తలెత్తకుండా ఉండటానికి ముఖేష్ అంబాని నేరుగా రంగంలోకి దిగడం జరిగిందనే మాట కూడా వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube