రిలయన్స్ అండర్ లోకి బిగ్ బజార్...ఎన్ని కోట్లో తెలుసా!

రిలయన్స్ ఇండస్ట్రీ బిగ్ బజార్ మాతృ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తుంది. కిశోర్ బియానీ కి చెందిన బిగ్ బజార్ మాతృ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ ను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కొనుగోలు చేయడానికి భారీ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

 Reliance Taking Over Future Group , Reliance, Big Bazar, Guture Group, Food, Fas-TeluguStop.com

గత కొద్దీ రోజులుగా ఈ అంశంపై అనేక వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.అయితే ఈ డీల్ కు సంబంధించి ఈ శనివారం ఫ్యూచర్ గ్రూప్ బోర్టు సభ్యులు సమావేశం కూడా కానున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సమావేశంలో ఫ్యూచర్ గ్రూప్ ను విక్రయించే ప్రతిపాదనను పరిశీలించనుండగా, ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.30వేల కోట్లవరకూ ఉంటుంది అని సమాచారం.ఈ ఒప్పందంలో భాగంగా మొదట గ్రోసరీ, దుస్తులు, సప్లై చైన్‌, కన్జూమర్‌ బిజినెస్‌లతో కూడిన ఐదు లిస్టెడ్‌ కంపెనీలు ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనం కానున్నాయి.అయితే విలీనం తరువాత మొత్తం రిటైల్‌ ఆస్తులను ఒకే యూనిట్‌గా ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్ కి అమ్మేయనున్నట్లు తెలుస్తుంది.

అయితే మొత్తం 30 వేల కోట్ల రూపాయలను రిలయన్స్ సంస్థ దఫాలు,దఫాలు గా చెల్లించనుంది. ఫుడ్‌, ఫ్యాషన్‌ సరఫరాలకు వీలుగా రిలయన్స్ తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కుదుర్చుకోనుంది.

ఈ బోర్డు సమావేశం నేపథ్యంలో ప్రస్తుతం ఫ్యూచర్‌ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీలన్నీ షేర్ మార్కెట్ లో లాభాలతో పరుగు తీస్తున్నాయి.తదుపరి దశలో రూ.3000 కోట్లు చెల్లించి ఫ్యూచర్ గ్రూప్ ఎంటర్ప్రైజెస్ లో 16 శాతం వాటాను రిలయన్స్ సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube