స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13’ టీజ‌ర్ రిలీజ్‌

‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ చిత్రాల‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఇంటి నెం.13’ .ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.ఫ‌స్ట్‌లుక్‌తోనే ప‌న్నా రాయ‌ల్ నుంచి మ‌రో డిఫ‌రెంట్ మూవీ రాబోతోంద‌ని అర్థ‌మైంది.ఈ నేప‌థ్యంలోనే సంక్రాంతి కానుక‌గా ‘ఇంటి నెం.13’ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చెయ్య‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతుంది.సినిమాటోగ్ర‌ఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేసేలా ఉన్నాయి.ఈ టీజ‌ర్ విడుద‌లైన క్ష‌ణం నుంచి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.ఈ చిత్రాన్ని రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై హేసన్‌ పాషా నిర్మిస్తున్నారు.

 Release Of Suspense Thriller 'inti No.13' Teaser , Inti No.13 , Tollywood , Thriller Movie , Teaser , Panna Royal, Tanikalla Barani, Prudhvi Raj, Anadh Raj-TeluguStop.com

‘ఇంటి నెం.13’ టీజ‌ర్ విడుద‌లైన సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌న్నా రాయ‌ల్ మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని అందించాల‌న్న ల‌క్ష్యంతో రూపొందించిన సినిమా ఇది.మిస్టీరియ‌స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని ఇస్తుంది.టీజ‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.

ఈ సినిమా కంటెంట్ ప‌రంగానే కాదు, టెక్నిక‌ల్‌గా కూడా చాలా హై రేంజ్‌లో ఉంటుంది.ఆడియ‌న్స్‌కి ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది.‘‘ అన్నారు.నిర్మాత హేస‌న్ పాషా మాట్లాడుతూ ‘‘ఈరోజు టీజ‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చాం.

 Release Of Suspense Thriller 'Inti No.13' Teaser , Inti No.13 , Tollywood , Thriller Movie , Teaser , Panna Royal, Tanikalla Barani, Prudhvi Raj, Anadh Raj-స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13’ టీజ‌ర్ రిలీజ్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మేం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌స్తోంది.మా బేన‌ర్ నుంచి ఓ డిఫ‌రెంట్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.

త్వ‌ర‌లోనే ఈ సినిమా ట్రైల‌ర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.

Telugu Anadh Raj, Inti, Panna Royal, Prudhvi Raj, Teaser, Thriller, Tollywood-Latest News - Telugu

ట్రైల‌ర్ రిలీజ్‌తో ఈ సినిమాపై ఆడియ‌న్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌న్న న‌మ్మ‌కం ఉంది.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం‘‘ అన్నారు. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని, గీతాసింగ్‌, శ్రీ‌ల‌క్ష్మి, గుండు సుద‌ర్శ‌న్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు

Telugu Anadh Raj, Inti, Panna Royal, Prudhvi Raj, Teaser, Thriller, Tollywood-Latest News - Telugu

సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌, ఎడిటింగ్‌: ఎస్‌.కె.చలం, కొరియోగ్ర‌ఫీ: కె.శ్రీ‌నివాస్‌, మాటలు: వెంకట్‌ బాలగోని, పాటలు: రాంబాబు గోశాల, సింగ‌ర్స్ శ్రియా గోష‌ల్‌, రాజ‌ల‌క్ష్మి (త‌మిళ్ సామి సాంగ్ ఫేమ్‌), మాల్గాడి శుభ‌, ఐశ్వ‌ర్య యాజ‌మాన్య‌, నిర్మాత: హేసన్‌ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube