లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఏపీలో విడుదలకు మార్గం సుగమం... ఇప్పుడెవరు చూస్తారు?  

Release Of Lakshmi\'s Ntr In Andhra Pradesh-chandrababu,court,elections 2019,lakshmi\\'s Ntr,movie Updates,ram Gopal Varma,tdp

 • రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంను ఏపీ మినహా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెల్సిందే. అయితే సినిమా విడుదల నేపథ్యంలో కొన్ని వివాదాలు తలెత్తాయి. సినిమాలో చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపించారని, దాంతో సినిమా వల్ల టీడీపీ దెబ్బ పడుతుందనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ నాయకులు ఏపీలో సినిమా విడుదల అడ్డుకున్నారు.

 • లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఏపీలో విడుదలకు మార్గం సుగమం... ఇప్పుడెవరు చూస్తారు?-Release Of Lakshmi's NTR In Andhra Pradesh

 • అందుకు సంబంధించిన కోర్టు స్టేను కూడా తీసుకు వచ్చారు. ఏపీలో సినిమా విడుదల చేయవద్దని హైకోర్టు స్టే ఇచ్చింది.

 • తాజాగా నేడు సినిమాను చూసేందుకు కోర్టు ఓకే చెప్పింది.

  సినిమాను నేడు కోర్టు చూసిన తర్వాత 12వ తారీకున విడుదలకు ఓకే చెప్పే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఎన్నికల ముందు విడుదల అయితే సంచలనం ఖాయం అని అంతా భావించారు.

 • కాని అనూహ్యంగా సినిమాను ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వాయిదా వేయడంలో సక్సెస్‌ అయ్యారు. తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల్లో విడుదలైన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం ఒక మంచి గౌరవప్రధమైన వసూళ్లను నమోదు చేసింది.

 • Release Of Lakshmi's NTR In Andhra Pradesh-Chandrababu Court Elections 2019 Lakshmi\\'s Ntr Movie Updates Ram Gopal Varma Tdp

  ఏపీలో ఎన్నికల తర్వాత రోజు అంటే ఈనెల 12న విడుదల అయితే ప్రయోజనం ఎంత అనే విషయం అందరికి తెల్సిందే. ఇప్పటికే మజిలీ ఉండటంతో పాటు, అదే రోజున చిత్రలహరి చిత్రం విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల నడుమ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల అవ్వడమే అనుమానం.

 • ఇంతటి పోటీ నేపథ్యంలో విడుదల అయినా కూడా ఆ సినిమాను జనాలు చూడటం కూడా కష్టమే అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీ నుండి అయిదు ఆరు కోట్ల వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రానికి కలెక్షన్స్‌ రూపంలో వచ్చేవి.

 • కాని అవి ఇప్పుడు లాస్‌గా చెప్పుకోవచ్చు.