ఈ టాలీవుడ్ ప్రముఖులు దగ్గరి బందువులని మీకు తెలుసా? వారెవరో చూడండి  

Relation Between Tollywood Celebrities -

మన తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటులు దర్శకులు మరెందరో కళాకారులు ఉన్నారు, సినిమా మీద ప్రేమ తో వారు సినీ పరిశ్రమ కి రావడానికి చాలా కష్టపడుతున్నారు.అయితే ఒకే కుటుంబం నుండి చాలా మంది నటులు కళాకారులు వస్తున్నారు ,సినిమా కి సంబంధించి ఎవరి పని వారిది కానీ నిజ జీవితం లో మీకు తెలియని కొందరి సినీ ప్రముఖుల బంధుత్వాలు.

Relation Between Tollywood Celebrities

1.రామ్ పోతినేని , శర్వానంద్

హీరో రామ్ , శర్వానంద్ ఇద్దరు తెలుగు సినిమాలో రాణిస్తున్న యువ హీరోలు.

అయితే వీరిద్దరు దగ్గరి బంధువులు అని మీకు తెలుసా? అవును రామ్ పోతినేని కి శర్వానంద్ బావ వరుస అవుతాడు.శర్వానంద్ అన్న రామ్ పోతినేని అక్క ఇద్దరు భార్య భర్తలు.

ఈ టాలీవుడ్ ప్రముఖులు దగ్గరి బందువులని మీకు తెలుసా వారెవరో చూడండి-Movie-Telugu Tollywood Photo Image

2.సందీప్ కిషన్ , చోటా కె నాయుడు

టాలీవుడ్ లో చోటా కె నాయుడు గారి కెమెరా పని తనం గురించి చెప్పనక్కర్లేదు , ఆయన హీరో లని చాలా బాగా చూపిస్తారని పేరుంది.

చోటా కె నాయుడికి యువ హీరో సందీప్ కిషన్ మేనల్లుడు అవుతాడు.సందీప్ హీరో గా నటించి చాలా సినిమాలకు చోటా కె నాయుడు కెమెరామెన్ గా చేశారు.

3.నాగార్జున , వెంకటేష్

తెలుగు పరిశ్రమలో పెద్ద కుటుంబాలు గా చెప్పుకునే వారిలో దగ్గుబాటి , అక్కినేని కుటుంబాలు ఉంటాయి.

వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ గారు నాగార్జున గారు మాజీ దంపతులు , వీరి కుమారుడు నాగ చైతన్య , వెంకటేష్ నాగార్జున లు సొంత బావ మరుదులు.కొన్ని కారణాల వల్ల నాగార్జున మొదటి భార్య తో విడాకులు అయినప్పటికీ వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

4.నగ్మా , జ్యోతిక

ఒకప్పటి అందాల తార నగ్మా , తమిళ్ హీరోయిన్ జ్యోతిక లు అక్క చెల్లెళ్లు.జ్యోతిక నగ్మా కి స్టెప్ సిస్టర్.

5.గోపి చంద్ , శ్రీకాంత్

తెలుగు సినిమా లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచున్న శ్రీకాంత్ కి హీరో గోపిచంద్ దగ్గరి బంధువే , గోపిచంద్ శ్రీకాంత్ గారి మేనకోడాలిని వివాహం చేసుకున్నాడు.

6.కొరటాల శివ , పోసాని కృష్ణ మురళి

మంచి సోషల్ మెసేజ్ కథ కి మాస్ ఏలిమెంట్లు కలిపి సినిమాలు తీస్తూ హీరోలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్నీ అభిమానులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా హిట్ల మీద హిట్లు కొడుతున్న దర్శకులు కొరటాల శివ.తెలుగు సినిమాలో మంచి రచయిత గా దర్శకుడిగా మరియు నటుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా పోసాని కృష్ణ మురళీ గారికి కొరటాల శివ మేనల్లుడు అవుతాడు.కొరటాల కి రచయిత గా అవ్వడానికి ప్రోత్సహం ఇచ్చింది కూడా ఆయనే.

7.కీరవాణి , ఎస్ ఎస్ రాజమౌళి

200కు పైగా సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకులు కీరవాణి గారు , అలాగే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారూ వీరిద్దరూ అన్నదమ్ముళ్లే , కీరవాణి గారి పిన్ని కొడుకు రాజమౌళి.రాజమౌళి గారూ తీసిన అన్ని సినిమాలకు సంగీతం అందించారు కీరవాణి గారు.

8.ప్రకాష్ రాజ్ , శ్రీ హరి

ప్రకాష్ రాజ్ , శ్రీ హరి గారు కలిసి కొన్ని సినిమాలు చేశారు , వీరిద్దరూ తెలుగు సినిమా ప్రేక్షకులు గుర్తిండి పోయే క్యారెక్టర్లు చేశారు .ప్రకాష్ రాజ్ గారి మొదటి భార్య , శ్రీ హరి గారి భార్య సొంత అక్క చెల్లెళ్లు.

9.మహేశ్వరి , శ్రీదేవి

అందాల తార శ్రీ దేవి గారు తెలుగు సినెమలలోనే కాదు భారత దేశ సినీ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే నటి.గులాబీ , పెళ్లి లాంటి హిట్ సినిమాల్లో నటించిన మహేశ్వరి దగ్గరి బంధువులు , శ్రీదేవి కి మేనకోడాలి వరుస అవుతుంది మహేశ్వరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Relation Between Tollywood Celebrities- Related....