శోభన్ బాబు- జగపతి బాబు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ఇప్పుటి సినిమాలు కాస్త రొటీన్ కు భిన్నంగా వస్తున్నాయి కానీ గతంలో మూస ధోరణిలో సినిమాలు వచ్చేవి.ఫ్యామిలీ కథలు ఎక్కువగా తెరకు ఎక్కేవి.

 Relation Between Sobhan Babu And Jagapathi Babu-TeluguStop.com

జనాలు కూడా వాటినే ఎక్కువగా చూసేందుకు ఇష్టపడే వారు.అందుకే దర్శక నిర్మాతల కథలన్నీ కుటుంబాల చుట్టే తిరుగుతుండేవి.

చక్కటి కుటుంబ కథల్లో ప్రధానంగా సవతుల పోరు, అత్తాకోడళ్ల వైరం నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి.ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ కనిపించేది.

 Relation Between Sobhan Babu And Jagapathi Babu-శోభన్ బాబు- జగపతి బాబు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అటు ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్ర పోషించాలంటే ఆ రోజుల్లో దర్శక నిర్మాతలకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు శోభన్‌బాబు.ఆయన కూడా ఇలాంటి క్యారెక్టర్లు చేసేందుకు నో చెప్పే వారు కాదు.

ఆయనకు లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువ.అయినా అటువంటి పాత్రల్లో తమ అభిమాన హీరోని చూడడానికి వాళ్లు కూడా ఇష్టపడేవారు.

కార్తీక దీపంతో ప్రారంభించి ఎన్నో చిత్రాలలో ఇలాంటి పాత్రలతో నటించారు శోభన్‌ బాబు.ఈ చిత్రాల్లో అధిక శాతం విజయవంతం అయ్యాయి కూడా.

శోభన్ బాబు తర్వాత అటువంటి పాత్రలను ఎక్కువగా పోషించిన హీరో జగపతి బాబుపాతికేళ్ల క్రితం శోభన్‌బాబులా ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు పాత్రలను పోషించేవారు.వాటిల్లో ఆయనకిద్దరు చిత్రం ఒకటి.ఈ సినిమాకు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకుడు.తన సినిమాలకు ఆయన పెట్టే టైటిల్స్‌ తమాషాగా ఉంటాయని వేరే చెప్పాలా.ఆయనకిద్దరు చిత్రంలో జగపతిబాబు సరసన రమ్యకృష్ణ, ఊహ నటించారు.ఈ చిత్ర ప్రారంభోత్సవంలో వీరి ముగ్గురి మీద నాగార్జున క్లాప్‌ ఇచ్చారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి స్వింగ్ లో కొనసాగుతున్న జగపతి బాబు.

పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు.హీరోగా కంటే ప్రస్తుతం చేస్తున్న విలన్ పాత్రలే ఆయనకు మంచి పేరు తీసుకొస్తున్నాయి.

నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తుండటంతో ఆయనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆయన నటనలో పదును సైతం పెరిగింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube