యాంకర్ సుమ పిన్ని ఎవరో తెలిస్తే అవాక్కవుతారు!

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సినిమాలు, సీరియళ్లు, ఆడియో ఫంక్షన్లు టీవీ షోలు, ఇంటర్వ్యూలు ఇలా సినిమా, టీవీ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలతో అత్యంత బిజీగా ఉండే యాంకర్.

 Relation Between Anchor Suma And Indu Anand-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్ ఎవరనే ప్రశ్నకు సైతం సుమ పేరే సమాధానంగా వినిపిస్తుంది.దాదాపు రెండు దశాబ్దాలుగా టీవీ రంగంలో వేర్వేరు షోలతో కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.
పెద్ద పెద్ద స్టార్ హీరోల గురించి తెలియని వాళ్లకు సైతం సుమ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది.ఈ ఛానల్, ఆ ఛానల్ అనే తేడా లేకుండా అన్ని ఛానెళ్లలోనూ సుమ సందడి కొనసాగుతోంది.

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల భార్య అయిన సుమ ఒకవైపు ఇల్లాలుగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే యాంకర్ గా రెండు చేతులా డబ్బులను సంపాదిస్తున్నారు.మలయాళీ అయినప్పటికీ సుమ తెలుగును స్పష్టంగా ఉచ్చరిస్తూ వరుస అవకాశాలు సంపాదిస్తున్నారు,
సమయస్పూర్తి, మాటకారితనం, ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించడం సుమ ప్రత్యేకతలు.

 Relation Between Anchor Suma And Indu Anand-యాంకర్ సుమ పిన్ని ఎవరో తెలిస్తే అవాక్కవుతారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బుల్లితెరపై సుమ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు.అయితే సుమ పిన్ని కూడా ప్రేక్షకులకు సుపరిచితమైన నటే.టీవీ సీరియళ్లలో నటించిన సుమ నేటికీ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగానే ఉన్నారు.మంజులా నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చక్రవాకం సీరియల్ లో నటించిన ఇందూ ఆనంద్ సుమ పిన్ని.
అమ్మ, అమ్మమ్మ పాత్రల్లో నటించి ఇందూ ఆనంద్ ప్రేక్షకులను మెప్పించారు.సీరియల్ నటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఇందూ ఆనంద్ కేరళకు చెందిన నటి.తొలుత హిందీ సీరియల్స్ లో నటించిన ఇందూ ఆనంద్ ఆ తర్వాత తెలుగు సిరియళ్లలో వరుస అవకాశాలతో ఎదిగారు.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈమె నటిగా ఉన్నత స్థానానికి ఎదగడం గమనార్హం.

#Serial Actress #Aunt #Suma Pinni #Manjula Naidu #Anchor Suma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు