ఆ హీరో తల్లి చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది.. రేఖ కామెంట్స్ వైరల్?

సినిమా ఇండస్ట్రీలో నటీనటులు షూటింగ్ సమయంలో ప్రేమలో పడటం, ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల విడిపోవడం సాధారణంగా జరుగుతుంది.హీరోహీరోయిన్లు కొంచెం సన్నిహితంగా ఆయా హీరోహీరోయిన్ల గురించి ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తుంటాయి.

 Rekha Vinod Mehra Tragic Love Story Actor Mother Tried Beat Rekha With Sandal, I-TeluguStop.com

అలనాటి హీరోయిన్లలో ఒకరైన రేఖ గురించి ఈ తరహా వార్తలు ఎక్కువగా ప్రచారంలోకి రావడం గమనార్హం.అందం, అభినయంతో రేఖ ఉత్తమ నటిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

తన నటనతో రేఖ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.అయితే లవ్ ట్రాక్ కు సంబంధించిన వార్తల ద్వారానే రేఖ చాలా సందర్భాల్లో వార్తల్లో నిలవడం గమనార్హం.

 Rekha Vinod Mehra Tragic Love Story Actor Mother Tried Beat Rekha With Sandal, I-TeluguStop.com

వినోద మెహ్రా అనే నటుడు రేఖ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.అయితే వినోద్ మెహ్రా ఫ్యామిలీ మాత్రం రేఖను తమ ఇంటికి కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకోలేదు.వినోద్ మెహ్రా తల్లి తన కొడుకుకు రేఖతో పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పారు.

అయితే వినోద్ మెహ్రా రేఖ మాత్రం ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నారు.

Telugu Sandal, Bollywood, Rekha, Vinod Mehra-Movie

ఆ తర్వాత వినోద్ మెహ్రా తాను రేఖను పెళ్లి చేసుకున్నానని చెప్పగా ఆమె రేఖను ఏకంగా చెప్పుతో కొట్టడానికి ప్రయత్నం చేశారు.వినోద్ మెహ్రా తల్లికి నచ్చజెప్పాలని చూసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు.ఆ తర్వాత రేఖ కన్నీళ్లు పెట్టుకుంటూ వినోద్ ఇంటినుంచి వెళ్లిపోయి ఆ తర్వాత వినోద్ తో విడిపోయారు.

Telugu Sandal, Bollywood, Rekha, Vinod Mehra-Movie

రేఖ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.వినోద్ మెహ్రా తల్లి తనను ఎన్నో అపవాదుల ద్వారా వార్తల్లో నిలిచిన మహిళనని అందువల్లే వినోద్ తల్లి తనను కోడలిగా అంగీకరించడానికి ఇష్టపడలేదని రేఖ పేర్కొన్నారు.తాను సినిమా నటి కావడం వల్ల ఎదురైన అవమానాల గురించి రేఖ ఈ విధంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube