నాగార్జున కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తున్నానంటున్న హీరోయిన్...  

Rekha Vedavyas Still Waiting For Hero Nagarjuna Call - Telugu Actor Nagarjuna, Nagarjuna News, Rekha Vedavyas, Rekha Vedavyas Movie News, Rekha Vedavyas News, Tollywood, Tollywood Actress Rekha Vedavyas

అప్పట్లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆనందం సినిమాలో ఆకాష్ సరసన నటించి మెప్పించిన అటువంటి హీరోయిన్ “రేఖ వేదవ్యాస్” ఇప్పటికే అందరికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఆ తరువాత నందమూరి హీరో తారకరత్న నటించినటువంటి ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంలో కూడా డా “నెమలి కన్నోడా” అంటూ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

Rekha Vedavyas Still Waiting For Hero Nagarjuna Call

అయితే ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నప్పటికీ గత కొద్దికాలంగా ఏమైందో ఏమో గాని తన మకాం ముంబైకి మార్చేసింది.ఆ తర్వాత సినీ పరిశ్రమకి కొంతమేర దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ అమ్మడు స్టార్ కమెడియన్ మరియు హీరో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీ తో సరదాగా అనే షో లో పాల్గొన్నారు.ఇందులో భాగంగా పలు రకాల విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో అప్పట్లో నాగార్జున నటించిన టువంటి మన్మధుడు చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించానని, కానీ అంతకుముందు నాగార్జున తనకి నెక్స్ట్ మళ్లీ సినిమా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చినట్లు చెప్పింది.అంతేగాక అయితే ఆ విషయం గుర్తు చేస్తూ నాగార్జున సార్ ఇప్పటికీ మీ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ చలోక్తులు పేల్చింది.

అయితే గతంలో కొన్ని సార్లు తాను చనిపోయినట్లు కొన్ని పత్రిక తప్పుడు కథనాలు రాశాయని అన్నారు.దీంతో తమకు తెలిసిన వాళ్ళు మరియు బంధువులు సన్నిహితులు అసలు ఏమైందని కనుక్కునేందుకు ఫోన్ల మీద ఫోన్లు చేశారని చెప్పుకొచ్చింది.

అంతేగాక తనకు ఒకరోజు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వస్తే యూత్ కి ఏ పార్కు లో కావాలంటే ఆ పార్కులో ఎంత సేపైనా తిరిగే అవకాశం కల్పిస్తానని సరదాగా చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

అయితే ఈ అమ్మడు అప్పట్లో ఈ చిత్రానికి అవుట్ డోర్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా చిత్ర యూనిట్ సభ్యులు విమానం టికెట్ బుక్ చేయమని చెప్పగా వారు వైజాగ్ లో విమానాశ్రయం లేదంటూ రైలులో మాత్రమే ప్రయాణించాలని చెప్పి ఫుల్ చేశారని అన్నారు.అంతేకాక ఇప్పటివరకు తాను పెళ్లి చేసుకోలేదని అందుకు కారణం తన మనసుకు నచ్చిన వాళ్ళు దొరకలేదని ఒకవేళ ఇకముందైనా దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rekha Vedavyas Still Waiting For Hero Nagarjuna Call Related Telugu News,Photos/Pics,Images..

footer-test