ప్రభాస్ పేరు చెప్పి ఈ టాలీవుడ్ హీరోయిన్ ను హోటల్ కు పిలిచారట.. చివరకు?

స్టార్ హీరో ప్రభాస్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు మన దేశంలో దాదాపుగా ఉండరనే సంగతి తెలిసిందే.జీవితంలో ప్రభాస్ ను ఒక్కసారైనా కలవాలని కోరుకుంటున్న అభిమానులు చాలామంది ఉన్నారు.

 Rekha Boj Shared Her Bad Experience In Social Media Details, Rekha Boj, Hero Prabhas, Rekha Boj Bad Exprerience, Prabhs Fan, Prabhas Seenu, Novatel Hotel, Tollywood Heroine Rekha Boj-TeluguStop.com

బాహుబలి, బాహుబలి2 సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకున్న ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాపైనా ఈ సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను క్రియేట్ చేశారు.

ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా భారీగా అంచనాలు ఏర్పడగా వచ్చే ఏడాది రెండు సినిమాలతో 2024లో మరో రెండు సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 Rekha Boj Shared Her Bad Experience In Social Media Details, Rekha Boj, Hero Prabhas, Rekha Boj Bad Exprerience, Prabhs Fan, Prabhas Seenu, Novatel Hotel, Tollywood Heroine Rekha Boj-ప్రభాస్ పేరు చెప్పి ఈ టాలీవుడ్ హీరోయిన్ ను హోటల్ కు పిలిచారట.. చివరకు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడగా ఈ రెండు సినిమాల బడ్జెట్లు కూడా ప్రేక్షకుల అంచనాలకు అందని స్థాయిలో ఉన్నాయని సమాచారం అందుతోంది.

అయితే ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన రేఖా భోజ్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ వీడియో కింద కామెంట్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సైతం పంచుకున్నారు.

2016 సంవత్సరంలో ఒక వ్యక్తి ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పి తనకు కాల్ చేశాడని రేఖా భోజ్ తెలిపారు.ఆ వ్యక్తి ప్రభాస్ నాకోసం నోవాటెల్ లో ఎదురుచూస్తున్నారని నువ్వు ప్రభాస్ అభిమాని అని లైవ్ లో చెప్పడంతో ప్రభాస్ కలవాలని అనుకుంటున్నారని చెప్పాడని రేఖా భోజ్ తెలిపారు.

ఆ వ్యక్తి అలా చెప్పడంతో తాను పగలబడి నవ్వుకుని ఆ వ్యక్తిని తిట్టానని ఆమె వెల్లడించారు.ఆ వ్యక్తి కాల్ చేయడానికి రెండు రోజుల ముందు కమెడియన్ ప్రభాస్ శ్రీను ప్రభాస్ అమెరికాలో ఉన్నారని ఆరు నెలల వరకు ఇండియాకు రారని చెప్పారని ఇలా ఇంకెన్ని మోసాలు జరుగుతున్నాయో ఎవరికి తెలుసు అని ఆమె కామెంట్ చేశారు.ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పేర్లు చెప్పి మోసాలు చేస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube