అక్కడ వినాయకుడు పెరుగుతున్నాడోచ్చ్ …!  

Rejinthal Ganesh Idol Increasing Size,Rejinthal ,Siddi Vinayaka Temple, Sanga reddy - Telugu Rejinthal, Rejinthal Ganesh Idol Increasing Size, Sanga Reddy, Siddi Vinayaka Temple

ఎవరైనా మంచి పని తలపెట్టాలంటే ముందుగా అందరం వినాయకుని పూజిస్తాం.తల పెట్టే పనికి ఎలాంటి విఘ్నాలు జరగకుండా మంచిగా కొనసాగాలని తొలుత వినాయకుని పూజిస్తాం.

 Rejinthal Ganesh Idol Size Increasing

అయితే ఓ ప్రాంతంలో వినాయకుడు పెరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం రేజింతల్ లో ఒక ప్రసిద్ధ వినాయకుడి ఆలయం ఉంది.

అయితే ఆ ఆలయం గురించి ఎక్కువగా ప్రాచుర్యం లేకపోవడంతో చాలా మందికి ఈ విషయం గురించి తెలియకపోవచ్చు.

అక్కడ వినాయకుడు పెరుగుతున్నాడోచ్చ్ …-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ వినాయకుడు ఒక వైపు నుంచి హనుమంతుడి రూపంగా, మరోవైపు వినాయకుడిగా దర్శనమిస్తూ భక్తులకు కొంగు బంగారంగా మారాడు ఈ సిద్ధి వినాయకుడు ఆ ప్రాంతం ప్రజలకు.

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో తొలి సిద్ధి వినాయక ఆలయం కూడా అదేనట.ఆ గర్భాలయంలో వినాయకుడు దక్షిణ విముఖుడై భక్తులకు దర్శనం ఇస్తాడు.ఈ ఆలయ నిర్మాణం 217 సంవత్సరల కిందటే జరిగిందని అక్కడి వారు తెలుపుతున్నారు.

అయితే ఇటీవల ఏటికేడు రేజింతల్ సిద్ది వినాయకుడు పెరుగుతున్నాడు అంటూ అక్కడి వ్యక్తులు తెలియజేస్తున్నారు.

ప్రతిష్టాపన సమయంలో రెండున్నర అడుగుల ఎత్తు మూడడుగుల వెడల్పు ఉన్న సిద్ధి వినాయక విగ్రహం ప్రస్తుతం అయిదున్నర అడుగుల ఎత్తు ఆరడుగుల వెడల్పుతో ఉన్నట్లు ఆ ప్రాంత భక్తులు తెలియజేస్తున్నారు.అచ్చం కాణిపాకం వినాయకుడిలా ఉంది కాబోలు.

#Sanga Reddy #Rejinthal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rejinthal Ganesh Idol Size Increasing Related Telugu News,Photos/Pics,Images..