సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించేందుకు కేంద్రం మొగ్గు

దేశంలో కరోనా తర్వాత అంత ఎక్కువగా ప్రజలని ఆకర్షిస్తున్న ఇష్యూ సుశాంత్ డెత్ మిస్టరీ.అతను మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ముంబై పోలీసులు తేల్చేసిన కూడా అతని మృతి వెనుక అంతులేని మిస్టరీ ఉందని చాలా మంది భావిస్తున్నారు.

 Cbi Probe Into Sushant Singh Rajput's Death Raises, Reha, Sushant Singh Rajput,-TeluguStop.com

చాలా కీలక విషయాల మీద పోలీసులు దృష్టి పెట్టలేదని, చాలా మందిని పూర్తిగా విచారించాకుండానే కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో పాట్నా పోలీసులు కేసు విచారణ మొదలు పెట్టారు.

అయితే పాట్నా పోలీసులు సుశాంత్ కేసు విచారణ కోసం ముంబై వెళ్ళగా అక్కడ వారిని ముంబై పోలీసులు కావాలని క్వారంటైన్ లో పెట్టడం, కేసు వివరాలు చెప్పకపోవడం వంటి కారణాలతో ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని బిహార్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

కేంద్రం దీనిని పరిశీలించి సుశాంత్ డెత్ మిస్టరీని చేధించే బాధ్యతలని సీబీఐకి అప్పగించడానికి ఒకే చెప్పింది.

సిబీఐ కేంద్రం పరిధిలో ఉంటుంది కాబట్టి వారు విచారణ ప్రారంభిస్తే ఇంకా మహారాష్ట్ర పోలీసులకి అడ్డుకునే హక్కు ఉండదు.ఇదిలా ఉంటే ఈడీ తాజాగా సుశాంత్ బ్యాంకు లావాదేవీలపై విచారించేందుకు అతని ప్రియురాలు రియా చక్రవర్తికి నోటీసు పంపించారు.

విచారణకి హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.మరో వైపు సుశాంత్ కేసు విచారణ బాధ్యతలని ముంబై పోలీసులకి అప్పగించాలని రియా సుప్రీం కోర్టులో వేసిన కేసుని ధర్మాసనం కొట్టేసింది.

దీంతో రియాకి సుశాంత్ వ్యవహారంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో అనేది సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube