తల్లి కాకుండా చేస్తుంది ఆ అలవాటు

మద్యం అతిప్రియంగా మగవారు తాగుతారేమో కాని, కేవలం మగవారికే ప్రియం కాదు.మందుబాబులు ఉండటం అన్నిచోట్ల కామన్ అయితే, మహానగరంలోని మేడల్లో మందుపాపలు ఉండటం కూడా చాలా కామన్.

 Regular Alcohol Intake Can Make Women Infertile – Study-TeluguStop.com

ఇక విదేశాల్లో అయితే, మహిళలు మద్యం తాగడం మరింత కామన్ విషయం.ఈ అలవాటు మహిళలకి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

దీన్ని వలన తల్లి అయ్యే అవకాశం కోల్పోతున్న మహిళలు చాలామందే ఉన్నారట.

రోజుకి ఒక డ్రింక్ ఓకే కాని, వారానికి కనీసం 14-15 డ్రింక్స్ తాగుతున్న మహిళల ఫెర్టిలిటి దెబ్బతినే అవకాశం చాలావరకు దెబ్బతింటోందని యూనివర్శిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు చెబుతున్నారు.

మద్యం రెగ్యులర్ గా తాగే మహిళల్లో 307 సైకిల్స్ కి 37 ప్రెగ్నెస్సిలు కనిపించాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంతాన సమస్యలతో బాధపడే మహిళల సంఖ్య 24% పెరిగిపోయిందట.

దీనికి కారణం మద్యానికి బానిసలవ్వడమే.డెన్మార్క్‌, యూఎస్, యూకేలో ఈ సమస్య మరింత ఎక్కువే ఉందట.

కాబట్టి తల్లి కావాలనుకునే మహిళలు మద్యానికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube