మీరు కరోనా టెస్ట్ చేయించు కోవాలా..? ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి …!  

Register Here to do Corona test, Andhra Pradesh, Corona Tests, verahealthcare, COVID-19 Sample Collection - Telugu Andhra Pradesh, Corona Tests, Covid-19 Sample Collection, Register Here To Do Corona Test, Verahealthcare

మీకు ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్లు అనిపిస్తోందా.? అయితే హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారా.? అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఓ ఆలోచన చేసింది.అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది.

 Register Corona Tests Andhra Pradesh

కరోనా పరీక్షలు బయటికి వెళ్లి ఎక్కడ చేపించుకోవాలి అర్థం కాని వ్యక్తులు ఈ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.ప్రస్తుతానికి భారతదేశంలో కరోనా వైరస్ టెస్టులు నిర్వహించిన రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరింతగా ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించింది.

అంతేకాకుండా ఈ కరోనా వైరస్ పరీక్షల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన వారికి రైల్వే స్టేషన్లలలో లేదా ఇతర రాష్ట్రాల సరిహద్దుల వద్ద కరోనా వైరస్ టెస్టులను నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.అయినప్పటికీ మరికొందరు కరోనా వైరస్ టెస్టులు చేయించుకోవాలని ఆలోచన చేస్తున్నారు.

మీరు కరోనా టెస్ట్ చేయించు కోవాలా.. ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి …-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ -19 శాంపిల్ కలెక్షన్ వెబ్‌సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇందుకోసం ప్రజలు

covid-andhrapradesh.Verahealthcare.com

ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని రాష్ట్ర అధికారి గోపాలకృష్ణ దివేది తెలియజేశారు.

పరీక్షలు చేయించుకోవాలనుకున్నవారు అందులో వారి పేరు, ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, వయసు తోపాటు వారు నివసిస్తున్న అడ్రస్ పొందుపరచాలి.అంతే కాకుండా వారికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, లేకపోతే అసలు ఎలాంటి లక్షణాలు లేవా వివరాలకు క్లిక్ చేయాల్సి ఉంటుంది.దీంతో మీకు దగ్గరలో ఉన్న కోవిడ్ పరీక్షలు చేస్తున్న లోకేషన్ వివరాలను అందులో కనపడతాయి.

అందులో మీకు నచ్చిన లొకేషన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.అందుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 9963112781 ఫోన్ నెంబర్ ని సంప్రదించవచ్చు.

#Verahealthcare #Andhra Pradesh #Corona Tests

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Register Corona Tests Andhra Pradesh Related Telugu News,Photos/Pics,Images..