ఆ విష‌యంలో ప్రాంతీయ పార్టీలు ఓకే.. జాతీయ పార్టీలతోనే వైసీపీకి చిక్కులు

ఏపీలో ఇప్పుడు బ‌ద్వేల్ ఉప ఎన్నిక ఎంతో జోరు మీద సాగుతుంది అనుకున్నారు.కానీ అన‌నూహ్యంగా ప్ర‌ధాన పార్టీలు అయిన టీడీపీ, జ‌న‌సేన పార్టీలు త‌ప్పుకోవ‌డంతో జ‌గ‌న్ పార్టీకి పెద్ద చిక్కులు త‌ప్పాయ‌నే చెప్పాలి.

 Regional Parties Are Ok In That Regard .. The Implications For The Ycp Are With-TeluguStop.com

ఒక‌వేళ పోటీ ఉన్నా కూడా వైసీపీ గెలిచేందుకు ఎక్కువ‌వ ఆస్కారాలు ఉన్నాయ‌నేది అంద‌రికీ తెలిసిందే.ఇందుకు జ‌రుగుతున్న వ‌రుస ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూస్తేనే అర్థం అవుతుంది.

ఏ ఒక్క ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోయినా కాస్త న‌మ్మ‌కం త‌గ్గేది కానీ వ‌రుస బెట్టి ఎన్నిక‌ల్లో తిరుగులేని మెజార్టీని వైసీపీ సొంతం చేసుకుంటోంది.

ఇప్పుడు జ‌గ‌న్‌కు మంచి మేజ్ ఉంది.

ఆయ‌న రెండున్నరేళ్ల పాలనను కూడా ప్ర‌జ‌లు ఆస్వాదిస్తున్నార‌ని వ‌రుస ఎన్నిక‌లే నిరూపిస్తున్నాయి.ఇక‌పోతే రెండున్న‌రేండ్లు గ‌డిచిన త‌ర్వాత వ‌చ్చిన లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో కూడా అదే స్థాయిలో మెజార్టీని క‌న‌బ‌ర‌చ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

ఇక లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే ఏపీలో మ‌రో ఉప ఎన్నిక రాబోతోంది.అదే బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌.

ఇందులో గెల‌వ‌డం వైసీపీకి నల్లేరు మీద నడకలా క‌నిపిస్తోంది.ప్ర‌తిప‌క్షాలుకు కూడా పెద్ద‌గా ఎటువంటి ఆశలు లేక‌పోయాయి.

Telugu Ap, Badevel, Bjp, Congress, Sudha, Sommuveeraju-Telugu Political News

దీంతో అటు జనసేనతో పాటుగా ఇటు టీడీపీ కూడా రాజ‌కీయ విలువ‌ల‌ను పాటిస్తున్నామ‌ని చెబుతూ పోటీ నుంచి త‌ప్పుకున్నాయి.దీంతో వైసీపీకి ల‌క‌ల్ పార్టీల నుంచి పోటీ త‌ప్పిన‌ట్టు అయింది.కానీ జీతీయ పార్టీలు మాత్రం సై అంటే సై అంటున్నాయి.అటు బీజేపీ, కాంగ్రెస్ లు పోటీకి రెడీ అంటున్నాయి.దీంతో జాతీయ పార్టీల‌తో వైసీపీకి కొత్త చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి.ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసి రికార్డు సృష్టించాల‌ని అనుకుంటున్న వైసీపీకి పోటీ అనివార్యంలా మారిపోతోంది.

దీంతో వైసీపీ అధినాయ‌క‌త్వం కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల‌ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.చూడాలి మ‌రి వైసీపీ ప్ర‌య‌త్నాలు ఏ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాయో.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube