నేను ఐటెం కాదంటున్న బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్‌లో నెలకొంది.ఇక ఈ సినిమాలో ఓ హాట్ బ్యూటీ ఐటెం సాంగ్ ఉండబోతుందని గతంలోనే వార్తలు వచ్చాయి.

అందాల భామ రెజీనా ఈ సినిమాలో చిరుతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులేయనుంది.దీంతో ఆమెకు అదిరిపోయే అదృష్టం పట్టిందని అందరూ అనుకున్నారు.

అయితే ఈ సినిమాలో ఆమె చేయబోయేది ఐటెం సాంగ్ కాదని రెజీనా అంటోంది.‘చిరంజీవి లాంటి స్టార్ హీరోతో చిందులేసే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని, అయితే ఆయనతో కలిసి చేసేది ఐటెం సాంగ్ కాదని, అది ఒక సెలబ్రేషన్ సాంగ్’ అంటూ రెజీనా చెప్పుకొచ్చింది.

Advertisement

ఇక ఇలాంటి ప్రత్యేక గీతాలకు గతంలో తానెప్పుడు చిందులేయలేదని, ఇదే తన తొలి, చివరి స్పెషల్ సాంగ్ అవుతుందని కుండ బద్దలు కొట్టింది ఈ బ్యూటీ.మొత్తానికి ఐటెం అనే మాట వింటేనే రెజీనాకు చిర్రెత్తుతుందని పలువురు అంటున్నారు.

ఐటెం సాంగ్‌కు స్పెషల్ సాంగ్, సెలబ్రేషన్ సాంగ్ అనే పర్యాయ పదాలు ఎందుకు వాడుతుందో ఆమెకే తెలియాలి అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు