రెట్రో లుక్ లో రెజినా… సోషల్ మీడియాలో ట్రోల్  

Regina Retro Tollywood - Telugu Instragram, Regina Retro Looks Viral In Social Media, South Cinema, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కుర్ర హీరోలతో ఆడిపాడిన అందాల భామ రెజినా కసాండ్రా.కెరియర్ ఆరంభంలో వరుసగా అవకాశాలు అందుకొని కుర్ర హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిన ఈ అమ్మడు తరువాత అవకాశాలకి దూరం అయిపొయింది.

 Regina Retro Tollywood

తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో చేతిలో అవకాశాలు లేవనే చెప్పాలి.చిరంజీవి ఆచార్య సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఈ అమ్మడు ఒకే చెప్పింది.

ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ జరిగినట్లు తెలుస్తుంది.గ్లామర్ ప్రదర్శనకి ఏ మాత్రం అభ్యంతరం చెప్పని రెజినా ఆ స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది.

రెట్రో లుక్ లో రెజినా… సోషల్ మీడియాలో ట్రోల్-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫోటోషూట్ లతో ఈ అమ్మడు సందడి చేస్తుంది.

తాజాగా బయటికి వచ్చిన రెజీనా ఫోటోలు చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఈమె మేకోవర్ చూసి రెజినా ఇలా అయిపోయింది ఏంటి అని అనుకుంటున్నారు.రెట్రో స్టైల్ లో ఈ అమ్మడు లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

పాతకాలపు ఫారిన్ భామల తరహాలో ఈమె మేకప్, లుక్స్ ఉన్నాయి.సౌత్ ఇండియన్ బ్యూటీగా హోమ్ప్లీ లుక్స్ లో కనిపించే రెజినా ఈ లుక్ లో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి.

దీంతో ఈమె ఫోటోలని ఉపయోగించి నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Regina Retro Looks Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..