ఆ విషయం నన్నే ఎందుకు అడుగుతారు?

సినీ పరిశ్రమలో నటీనటులకు ఎదురయ్యే ప్రశ్నలు నెక్స్ట్ వచ్చే సినిమా ఏంటి, మీ పెళ్లెప్పుడు.ఇవి కాకుండా వారికి మరో ప్రశ్న ఎదురుకాదు.

 Regina, Big Hero, Movies, Reacts,latest Tollywood  Viral News,comments-TeluguStop.com

కానీ ఓ టాలీవుడ్ నటి అప్పట్లో వరుస సినిమాలలో నటించగా ఇప్పుడు అవకాశాలు లేనందున ఆమెకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ఇంతకీ ఆమె ఎవరో కాదు.

రెజీనా కాసాండ్రా.

రెజీనా తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది.

తెలుగులో కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రెజీనా ఈమధ్య తక్కువగా కనబడుతుంది.అంతేకాకుండా అవకాశాలు కూడా రావట్లేవు.దీనిని ఉద్దేశించి పెద్ద హీరోల సరసన ఎందుకు చాన్స్ రావడం లేదని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.దీంతో రెజీనా దీనికి సమాధానం తెలియదంటూ తప్పుకుంటుంది.

ఈ ప్రశ్నను మీడియా మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇండస్ట్రీలలో కొందరు ఎన్నో సార్లు ప్రశ్నించారట.కానీ తనకు నిజానికి పెద్ద హీరోల సరసన అవకాశాలు ఎందుకు రావట్లేదో తెలియదంటుంది.

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన ఆఫర్లు రాలేకపోయేసరికి ఎంతో బాధపడేదట‌.కానీ ప్రస్తుతం ఓటీటీ రాకతో ఆ బాధ కాస్త లేదంటుంది.

సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశాలు రావడంతో పెద్ద హీరోల కోసం చూడాల్సిన అవసరం లేదంటుంది.

అయినా ఎంతో మంది స్టార్ హీరోయిన్ లకు పెద్ద హీరోల సరసనే అవకాశాలు లేకపోగా.

అలాంటప్పుడు తననెందుకు ప్రశ్నిస్తున్నారని అంటుంది.ఇదిలా ఉంటే చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఐటమ్ సాంగ్ లో రెజీనా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె నటించిన చక్ర సినిమా విడుదల కాగా అందులో ఆమె విలన్ పాత్రలో నటించింది.ఇందులో ఆమె పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube