మా సినిమాలో రెజీనా లేదు.. క్లారిటీ ఇచ్చిన ఛత్రపతి టీమ్!

టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెజీనా కసాండ్రా తెలుగులో పలు సినిమాల ద్వారా సందడి చేసినప్పటికీ ప్రస్తుతం ఈమెకు ఎలాంటి అవకాశాలు లేవు.ఈ క్రమంలోనే తమిళనాట వరుస సినిమాలను దక్కించుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు.

 Regina Is Not Part Of Chatrapati Remake-TeluguStop.com

రెజీనా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే.ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.

తాజాగా రెజీనాకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Regina Is Not Part Of Chatrapati Remake-మా సినిమాలో రెజీనా లేదు.. క్లారిటీ ఇచ్చిన ఛత్రపతి టీమ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజమౌళి దర్శకత్వం వహించిన “ఛత్రపతి” సినిమా బాలీవుడ్ రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

ఇప్పటికే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంతో మంది బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి.కానీ గత రెండు రోజుల నుంచి బాలీవుడ్ ఛత్రపతి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ రెజీనా నటిస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

Telugu Bellamkonda Srinivas, Chatrapathi Hindi Remake, Chatrapathi Remake, Team Confirms-Movie

తాజాగా ఈ విషయమై ఛత్రపతి టీమ్ స్పందిస్తూ.గత రెండు రోజుల నుంచి చత్రపతి సినిమా హీరోయిన్ రెజీనా అంటూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరోయిన్ గా చేయటం కోసం ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా రీమేక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించడం కోసం బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.మరి బెల్లంకొండ శ్రీనివాస్ తో ఎవరు జోడి కడతారనే విషయం తెలియాల్సి ఉంది.

ఇకపోతే ఈ సినిమాకు వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

#Team Confirms #Chatrapathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు