రెజినా కూడా పెంచేసింది..!

కుర్ర హీరోలతో కెరియర్ స్టార్ట్ చేసిన రెజినా చిన్నగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.మిడిల్ రేంజ్ సినిమా దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ అవుతూ వస్తున్న రెజినా ఇప్పుడు అందరికి కావాల్సి వచ్చింది.

 Regina Hikes Her Remuneration-TeluguStop.com

ఇక ఈమధ్యనే బాలీవుడ్ ఆంఖే-2 ఆఫర్ కూడా చేజిక్కించుకున్న అమ్మడు ఇక స్టార్ తిరిగేసిందని తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ షాక్ ఇస్తుందట.మొన్నటిదాకా సినిమాకు 60 లక్షల దాకా తీసుకున్న రెజినా సడెన్ గా ఇప్పుడు కోటి కోటిన్నార అంటూ చుక్కలు చూపిస్తుందట.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రెజినా క్రేజ్ ఉండగానే నాలుగు రాళ్లు వెనుకేయాలని చూస్తుంది.ఇక తెలుగులో అవసరాల శ్రీనివాస్ డైరక్షన్లో జ్యో అచ్యుతానంద, నక్షత్రం సినిమాల్లో నటిస్తున్న అమ్మడు అటు కోలీవుడ్ లో మా నగరంతో మళ్లీ ఎంట్రీ ఇస్తుంది.

మరి పెంచిన రెమ్యునరేషన్ తో రెజినా ఆఫర్లు ఏమాత్రం దక్కించుకుంటుందో చూడాలి.ఇక మొన్నటిదాకా యువ హీరోలతోనే నటించిన రెజినా త్వరలో తెలుగులో ఓ స్టార్ హీరో నటించే సినిమాలో లక్కీ చాన్స్ కొట్టేసిందట.

మరి ఆ వివారలేంటో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube