కొత్త సంవత్సరంలో కొత్త అవతారమెత్తుతున్న బ్యూటీ

తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రెజినా కాసాండ్రా తన నటనతో పాటు అందంతోనూ మంచి పేరును సంపాదించుకుంది.ఇప్పటికే ఈ బ్యూటీ పలు హిట్ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది.

 Regina Cassandra Signs An Intense Horror Movie-TeluguStop.com

కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం ఫేడవుట్ కాకుండా జాగ్రత్తలు పడుతూ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటోంది.

అయితే ఇటీవల ‘నిన్ను వీడని నీడను నేనే’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త సంవత్సరంలో జాతకం చెప్పేందుకు రెడీ అవుతోంది.

రెజినా తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో లీడ్ రోల్ చేసేందుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమలో అమ్మడు జ్యోతిష్యం చెప్పే పాత్రలో నటిస్తుందని, ఈ సినిమా పూర్తి హార్రర్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించనున్నారు.ఏదేమైనా కొత్త సంవత్సరంలో భవిష్యత్తు చెప్పే పాత్రలో నటించేందుకు అమ్మడు ఒప్పుకోవడంతో ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు సినీ ప్రేక్షకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube