ఇన్నాళ్లకు నోరు విప్పిన రెజీనా.. టైం వస్తే చెప్తానంటోంది       2018-07-08   23:29:57  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్స్‌ను, బుల్లి తెర నటీమణులను అమెరికాలో వారి ఒప్పందంతో లేదా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లుగా అక్కడ పోలీసులు కిషన్‌ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదు చేసి, అరెస్ట్‌ కూడా చేసిన విషయం తెల్సిందే. పోలీసులు ఈ వ్యవహారంలో ఉన్న పలువురు తెలుగు సినిమా హీరోయిన్స్‌తో మాట్లాడినట్లుగా, మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. పదుల సంఖ్యలో హీరోయిన్స్‌ ఉన్నప్పటికి రెజీనా పేరు మాత్రం ఎక్కువగా వచ్చింది. రెజీనా పేరు మొదటి నుండి ఈ వ్యవహారంలో వినిపిస్తున్నా కూడా ఆమె మాత్రం మౌనంగా ఉంటూ వచ్చింది.

తాజాగా రెజీనా ఈ విషయమై స్పందించింది. గత కొన్ని రోజులుగా తనను తనకు సంబంధం లేని విషయంలో ఇరికించి మాట్లాడుతున్నారు. తాను ముందే స్పందిస్తే కార్నర్‌ అయిపోతానేమో అనే ఉద్దేశ్యంతో ఇలా ఆలస్యంగా వచ్చాను. నాకు అస్సలు సంబంధం లేని విషయంలో నన్ను ఇన్వాల్వ్‌ చేసి మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాకు సంబంధం లేకున్నా కూడా వాటిని బరించాల్సి రావడం బాధగా ఉంది. పోలీసులు ఎంక్వౌరీలో మాట్లాడినంత మాత్రాన తాను సెక్స్‌ రాకెట్‌లో భాగస్వామిని అంటూ మీడియా వారు ఎలా అనుకుంటున్నారు అంటూ ఆవేదనతో చెప్పుకొచ్చింది.

రెజీనా ఇంకా మాట్లాడుతూ తనను అంతా అనుకున్నట్లుగా ఏమీ జరగలేదని, పూర్తి వివరాలను సరైన సమయంలో వెళ్లడిస్తాను అని చెప్పుకొచ్చింది. ఒక మనిషి గురించి మాట్లాడేముందు ఆ మనిషికి ఆ విషయానికి సంబంధం ఉందా అని తెలుసుకోని మాట్లాడాలని, ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని ఇరికించేలా మాట్లాడటం సమంజసం కాదని రెజీనా పేర్కొంది. తనకు సమయం వచ్చిందనిపించినప్పుడు అందరి ప్రశ్నకు తీరికగా కూర్చుని సమాధానాు చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రతి విషయంపై ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని తాను కాదని, తప్పకుండా ఈ విషయంపై క్లారిటీ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

రెజీనా చికాగో సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో ఉందనే విషయం మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఈమెకు సినిమాల్లో అవకాశాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. ఈమె ఎక్కువ శాతం అమెరికాలో జరిగే కార్యక్రమాలకు హాజరు అవుతూ అక్కడ డాన్స్‌ షోల్లో పాల్గొంటూ ఉంటుంది. అందుకే ఈమెపై ఎక్కువమందికి అనుమానం ఉంది. అమెరికా పోలీసులు కూడా రెజీనాతో చాలా సార్లు మాట్లాడారని, ఆమె కాల్‌ డేటాను కూడా తీసుకున్నారు అంటూ సమాచారం అందుతుంది. కిషన్‌ వద్ద రెజీనాకు సంబంధించిన వివరాలు కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాని రెజీనా మాత్రం తనకు ఏ పాపం తెలియదు అంటుంది. ఈ విషయంలో అసలు నిజాలు ఆ పైవాడికే తెలియాలి.