డబ్బు కోసం ఇలాంటి పనులా.. రెజినాపై మండిపడుతున్న నెటిజెన్స్?

Regina Cassandra Promotes Signature Whiskey

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారు వివిధ రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు.ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్స్ సెలబ్రిటీలు ఇలాంటి బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

 Regina Cassandra Promotes Signature Whiskey-TeluguStop.com

అయితే అవి ప్రజలకు ఏవిధంగా హాని కలిగించేవి కాకపోతే ఎలాంటి అభ్యంతరాలు ఉండవు కానీ ప్రజలకు ఏ మాత్రం నష్టం కలిగించేవి అయితే మాత్రం వాటిపై పెద్ద వివాదాలు మొదలవుతాయి.ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు ఈ విధమైనటువంటి బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనాకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు.అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.

 Regina Cassandra Promotes Signature Whiskey-డబ్బు కోసం ఇలాంటి పనుల.. రెజినాపై మండిపడుతున్న నెటిజెన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో నెటిజన్లు ఈమెపై పెద్దఎత్తున విరుచుకుపడుతున్నారు.ఇంతకీ నెటిజన్లు ఈమె పై ఫైర్ అవ్వడానికి కారణం ఏమిటనే విషయానికి వస్తే…

రెజీనా సోషల్ మీడియా వేదికగా తనకు తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడే యాంకరింగ్ ప్రారంభించానని, ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని ఈ సంతోషాన్ని సిగ్నేచర్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ సిగ్నేచర్ బ్రాండ్ కి చెందిన ఆల్కహాల్ కు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో ఈమెపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.కేవలం డబ్బు కోసం ఇలాంటి హానికరమైన వాటి గురించి ఎలా ప్రమోట్ చేస్తారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరైతే తన పద్ధతి బాగా లేదని ఆమెను అన్ ఫాలో అవుతున్నట్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

#ReginaCassandra #ReginaPromote #Alcohol Product #Regina #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube