నేనే నా..? అంటూ ప్రశ్నిస్తున్న రెజీనా  

Regina Cassandra Nene Naa First Look Released - Telugu First Look, Nene Naa, Regina Cassandra, Telugu Movie News

అందాల భామ రెజీనా క్యాసెండ్రా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది.క్రమంలో అమ్మడు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మారుతుండటంతో, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.

Regina Cassandra Nene Naa First Look Released

ఇక ఈ బ్యూటీ ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎవరు సినిమాతో నిరూపించింది.కాగా మరో సస్పెన్స్ జోనర్ మూవీలో రెజీనా నటిస్తుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.‘నేనే నా.?’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ పోస్టర్‌లో రెజీనా ఓ రాజకుమారిగా ఉన్న ఫోటోలో మనకు కనిపిస్తుంది.ఈ ఫోటో చూస్తుంటే ఇదొక థ్రిల్లర్‌తో కూడిన సస్పెన్స్ మూవీ అని ఇట్టే అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాలో రెజీనా పాత్ర ఎలా ఉండబోతుంది అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇక సందీప్ కిషన్‌తో ‘నిన్ను వీడని నీడను నేనే’ అనే థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన కార్తీక్ రాజు, నేనే నా అంటూ మరోసారి అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమాలో రెజీనా లీడ్ రోల్‌ చేస్తుండగా వెన్నెల కిషోర్, అక్షర గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యాపిట్ ట్రీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సామ్ సంగీతం అందిస్తున్నాడు.

మరి ఈ సినిమాలో రెజీనా ప్రశ్నకు సమాధానం ఏమై ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Regina Cassandra Nene Naa First Look Released Related Telugu News,Photos/Pics,Images..