ఆ రీమేక్ మూవీ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న రెజీనా

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించి, అటు గ్లామర్, ఇటు నటనతో ఆకట్టుకున్న్ అందాల భామ రెజీనా కాసాండ్రా.ఈ అమ్మడు ఎంత వేగంగా పైకి లేచిందో అంతే వేగంగా అవకాశాలని కోల్పోయింది.

 Regina Cassandra Martial Arts Practice For New Movie-TeluguStop.com

అడపాదడపా సినిమాలు చేస్తున్న హీరోలతో జోడీ కట్టే అవకాశం పెద్దగా రెజీనాకి టాలీవుడ్ లో రావడం లేదనే చెప్పాలి.చివరిగా తెలుగులో అడవిశేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఎవరు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది.

ఇదిలా ఉంటే విశాల్ చక్ర మూవీలో కూడా నెగిటివ్ పాత్రలో మెస్మరైజ్ చేసింది.ఈ నేపధ్యంలో రెజీనా ఇక విలనీ పాత్రలతో సెటిల్ అయిపోవచ్చని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

 Regina Cassandra Martial Arts Practice For New Movie-ఆ రీమేక్ మూవీ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న రెజీనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక చాలా గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమాకి ఈ బ్యూటీ కమిట్ అయ్యింది.
సురేష్ ప్రొడక్షన్ లో కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ తెలుగు రీమేక్ లో రెజీనాతో పాటు నివేథా థామస్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.

సుదీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి శాకినీ డాకినీ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.ఫన్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథాంశం ఉండబోతుంది.ఈ నేపధ్యంలో రెజీనా ఈ సినిమా కోసం ఏకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటుంది.

ఫైట్స్ అన్ని కూడా మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలోనే ఉంటాయి కాబట్టి అందులో ప్రావీణ్యం ఉంటే బెటర్ అని రెజీనా ఇలా ట్రైనింగ్ అవుతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాతో ఎలా అయినా టాలీవుడ్ లో మళ్ళీ బ్రేక్ తీసుకొని అవకాశాలని పెంచుకోవాలని భావిస్తున్న రెజీనా గట్టిగానే కష్టపడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

#Sudheer Varma #Nivetha Thomas #Suresh Babu #Martial Arts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు