అలాంటి పాత్రలు చేస్తే తప్పేంటి.. రెజీనా కీలక వ్యాఖ్యలు..?

సుధీర్ బాబు హీరోగా నటించిన శివ మనస్సులో శృతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రెజీనా.ఆ తరువాత రెజీనా మిడిల్ రేంజ్ హీరోలతో ఎక్కువ సినిమాల్లో నటించారు.

 `regina Cassandra  Interesting Comments  About Negative Roles, Chakra Movie, Int-TeluguStop.com

రెజీనా నటించిన కొత్తజంట, పిల్లా నువ్వులేని జీవితం, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి.తెలుగులో అ! సినిమాలో రెజీనా చివరిగా నటించారు.

గతంతో పోలిస్తే రెజీనాకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం అవకాశాలు తగ్గాయి.

అయితే తెలుగులో విడుదలైన డబ్బింగ్ సినిమా చక్రలో రెజీనా పాత్రకు మంచి పేరు వచ్చింది.

ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు రెజీనా నటనకు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.అయితే నటిగా అన్ని తరహా పాత్రలను పోషిస్తున్న రెజీనా విలన్ పాత్రలు సైతం చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విలన్ పాత్రల్లో నటిస్తే తప్పేంటి అంటూ ఆమె ప్రశ్నించారు.

చక్ర సినిమాలోని పాత్ర గురించి మాట్లాడుతూ నటిగా తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి చక్ర సినిమా లాంటి పాత్రలు సహాయపడతాయని పేర్కొన్నారు.

చక్ర లాంటి మూవీలో విలన్ రోల్ రావడం అరుదుగా జరుగుతుందని.ఆ పాత్రలో కళ్లతోనే ఎక్కువగా నటించాల్సి ఉండటం వల్ల తనకు డైలాగులు తక్కువగా ఉన్నాయని తెలిపారు.

విలన్ పాత్రతో పాటు ఇతర పాత్రలు వచ్చినా నటిగా తమను తాము ప్రూవ్ చేసుకున్నామని తెలిపారు.

Telugu Chakra-Movie

కరోనా విజృంభించిన సమయంలో డిజిటల్ టెక్నాలజీపై అవగాహన ఏర్పడిందని.టెక్నాలజీ వల్ల మంచి, చెడు రెండూ సమానంగా ఉంటాయని ఆమె అన్నారు.ఓటీటీలను తాను ఆహ్వానిస్తానని.

కరోనా విజృంభించిన సమయంలో ఓటీటీ ఫిల్మ్ ఇండస్ట్రీని రక్షించిందని.ఓటీటీ ప్రసారాల నియంత్రణకు సంబంధించి సెన్సార్ బోర్డ్ నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube