ఫ్లాష్ బ్యాక్ చెప్పబోతున్న రెజీనా కసాండ్రా  

Regina Cassandra Flashback Movie Started, Tollywood, Kollywood, South Cinema, Director Don Sandy, Regina Cassandra , Flashback Movie,Chakra Movie, Villain Role - Telugu Chakra Movie, Director Don Sandy, Flashback Movie, Kollywood, Regina Cassandra, Regina Cassandra Flashback Movie Started, South Cinema, Tollywood, Villain Role

ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ రెజీనా కసాండ్రా.మొదటి సినిమా తర్వాత వరుస అవకాశాలతో ఈ అమ్మడు టాలీవుడ్ లో యంగ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

TeluguStop.com - Regina Cassandra Flashback Movie Started

సాయి ధరమ్ తేజ్ తో చేసిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో తరువాత ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అని అందరూ అనుకున్నారు.అయితే తరువాత అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.

హిందీలో ఒక సినిమాలో నటించింది.అక్కడ తాను చేసిన పాత్రకి మంచి ప్రశంసలు లభించిన మళ్ళీ అక్కడ కూడా అవకాశాలు రాలేదు.

TeluguStop.com - ఫ్లాష్ బ్యాక్ చెప్పబోతున్న రెజీనా కసాండ్రా-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే మాతృభాష తమిళంలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తుంది.తెలుగులో కూడా అప్పుడప్పుడు పలకరిస్తుంది.

ఈ అమ్మడు విశాల్ చక్ర సినిమాలో మెయిన్ విలన్ గా నటించింది అనే టాక్ వినిపించింది.

తెలుగులో సెవెన్, ఎవరు అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది.దీంతో ఈ భామకి ఎక్కువగా అలాంటి పాత్రలని దర్శకులు ఆఫర్ చేస్తున్నారు.మాతృభాషలో కూడా లేడీ ఒరియాంటెడ్ కథలు ఇప్పుడు ఎక్కువగా చేస్తుంది.

కార్తిక్ రాజ్ దర్శకత్వంలో శూర్పణఖ అనే సినిమాలో ఈ అమ్మడు మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించినట్లు తెలుస్తుంది.ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కాబోతుంది.

ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాకి రెజీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.డాన్ శాండీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.మొత్తానికి తెలుగులో అవకాశాలు తగ్గిన మాతృభాష తమిళంలో మాత్రం విభిన్న సినిమాలు, విభిన్న పాత్రలతో రెజీనా కెరియర్ ని గట్టిగానే ప్లాన్ చేసుకుందనే టాక్ వినిపిస్తుంది.

#Kollywood #Villain Role #ReginaCassandra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు