కాలేజీ రోజుల్లో లైంగిక వేధింపులకి గురయ్యా... రెజీనా ఆసక్తిక వాఖ్యలు

ప్రతి అమ్మాయి జీవితంలో బ్యాడ్ డేస్ కచ్చితంగా ఉంటాయి.ఏదో ఒక సందర్భంగా శారీరక హింసకి గురి కావడం లేదంటే లైంగిక వేధింపులకి గురికావడం జరుగుతూ ఉంటుంది.

 Regina Cassandra Says Faced Harassment In College Days, Tollywood, Kollywood, So-TeluguStop.com

అయితే ఇలాంటి విషయాలు చాలా మంది అమ్మాయిలు చెప్పుకోవడానికి ఇష్టపడరు.సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో పెరిగి అమ్మాయిలకి ఇలాంటి విషయాల గురించి బయట మాట్లాడాలన్న భయం ఉంటుంది.

అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది మహిళలు తమ జీవితంలో ఎదురైనా చేదు నిజాలు చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపుల గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.

సెలబ్రిటీలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఈ లైంగిక వేధింపులకి సంబంధించి బలమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు.

ఈ నేపధ్యంలో సెలబ్రిటీలు కూడా తమ జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మనసు విప్పి చెప్పుకుంటున్నారు.

తాజాగా సౌత్ హీరోయిన్ రెజీనా కూడా తన కాలేజీ రోజులలో ఎలాంటి లైంగిక వేధింపులకి గురయ్యాను అనే విషయాన్ని తెలియజేసింది.నేను చాలా సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.

నన్ను శారీరకంగా లొంగ తీసుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. కాలేజీకి వెళ్తున్న రోజుల్లో చెన్నైలోని ఓ పాపురల్‌ థియేటర్ వద్ద కొంత మంది అబ్బాయిలు నన్ను వేధించారు.

చెన్నైలోని ఇగా థియేటర్‌ బ్రిడ్జ్‌ వద్ద కొంత మంది అబ్బాయిలు నాతో పాటు తోడుగా వచ్చిన నలుగురు ఫ్రెండ్స్‌ను కూడా వేదింపులకు గురి చేశారు.అక్కడితో అయిపోలేదు నడిరోడ్డుపై కూడా ఓ వ్యక్తి నా పెదవులను తాకేందుకు ప్రయత్నించడం నన్ను ఎంతోగానో బాధపెట్టింది అంటూ రెజీనా చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube