తెలుగు లో రెజీనా ఎందుకు స్టార్ హీరోయిన్ అవ్వలేక పోయింది !

రెజినా కసాండ్రా. తెలుగులో శివ మనసులో శృతి అనే సినిమా ద్వారా పరిచయమైన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది.

 Regina Cassandra Career Failure Reasons,regina Cassandra,sakini Dakini,telugu,ka-TeluguStop.com

పుష్కలంగా టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లిస్టులో రెజీనా పేరు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే.కేవలం నటిగానే కాదు పబ్లిక్ ఈవెంట్స్ లో స్టార్ హీరోలతో యాంకరింగ్ చేయడం వంటి టైం సైన్స్ ఉన్న కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది రెజీనా.

ఇక రెజీనా తొలిసారి తెలుగులో నటించలేదు అంతకు ముందే తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాల్లో నటించింది ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.అని ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందం గా ఎంతో టాలెంట్ అందం నటన ఉన్న రెజీనా ఎందుకో స్టార్ హీరోయిన్ గా ఎదగడంలో మాత్రం విఫలమయ్యిందనే చెప్పుకోవాలి.

Telugu Amitab Bachchan, Kannada, Sakini Dakini, Subramnyam Sale, Sundeep Kishan,

తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద, శౌర్య, ఎవరు, షాకిని డాకిని వంటి సినిమాల్లో నటించింది.చివరి సారిగా తెలుగులో నివేద థామస్ తో కలిసి షాకిని డాకిని అనే సినిమాలో నటించిన ఇది పెద్దగా ఆమెకు వర్కౌట్ అవ్వలేదు.ఈ ఏడాది మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న రెజీనా తెలుగుతోపాటు కన్నడ తమిళ చిత్రాల్లో కూడా బిజీగానే ఉంది.వాస్తవానికి తెలుగులో వస్తున్న రెజీనా సౌత్ ఇండియాలోని పలు భాషలతో పాటు హిందీలో కూడా నటిస్తూ వస్తోంది.

Telugu Amitab Bachchan, Kannada, Sakini Dakini, Subramnyam Sale, Sundeep Kishan,

ఆ మధ్యకాలంలో అమితాబ్ బచ్చన్ తో రెజీనా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.ఇక రెజీనా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.ఆమెకు టాలీవుడ్ స్టార్ హీరోతో ఉన్న ఎఫైర్ కారణంగానే సినిమా ఇండస్ట్రీ నుంచి మెల్లిమెల్లిగా సైడ్ చేశారని వార్తలు వస్తున్నాయి.అది కాకుండా తెలుగులో సరైన పీఆర్ మానేజ్మెంట్ లేకపోవడం కూడా రెజీనాకు శాపం గా కనిపిస్తోంది.

ఇవి కాకుండా ఆమె ఒక భాషలో పరిమితం అవ్వకుండా పలు భాషలపై ఫోకస్ చేయడం వల్ల ఏ చిత్రంలోను టాప్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది.ఏది ఏమైనా ఇంత టాలెంట్ ఉన్న ఈ అమ్మడు ఖచ్చితంగా మంచి స్థాయికి అయితే చేరుతుంది కానీ అది ఇప్పట్లో మాత్రం జరిగేలా లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube