బాలీవుడ్ నిర్మాతలతో సాయి ధరమ్ తేజ్ బ్యూటీ!

భారతీయ అమెరికన్ సినీ నిర్మాత శోభు యార్లగడ్డ.ఈయన ఆర్కా మీడియా వర్క్స్ సినీ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు, ఆర్కా మీడియా వర్క్స్ వ్యవస్థాపకులలో ఒకరైన సినీ నిర్మాత దేవినేని ప్రసాద్ ల సినీ నిర్మాణం గురించి తెలిసిందే.వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలను నిర్మించగా.మంచి సక్సెస్ లు అందించాయి.అంతేకాకుండా వీరిద్దరూ కలిసి బాహుబలి సినిమాకు నిర్మాతలుగా చేయగా‌.వీరి నిర్మాణ సంస్థ పురస్కారాలు కూడా అందాయి.

 Regina Casandra Team Up Baahubali Producers-TeluguStop.com

ఇదిలా ఉంటే వీరిద్దరూ ప్రస్తుతం బుల్లితెరలో కూడా సీరియల్స్ నిర్మిస్తున్నారు.ఇక తాజాగా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనున్నారు.ప్రస్తుతం ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ లో నిర్మించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు.హారర్ జోనర్ నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ చేయనున్నారట.

ఇక ఈ సిరీస్ కు హీరోయిన్ గా రెజీనా కసాండ్రా ను ఎన్నుకున్నట్లు తెలుస్తుంది.

 Regina Casandra Team Up Baahubali Producers-బాలీవుడ్ నిర్మాతలతో సాయి ధరమ్ తేజ్ బ్యూటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Arka Media Works, Baahubali, Devineni Prasad, Producer, Regina, Regina And Arka Media Works, Regina Casandra Web Series, Regina Casandra With Arka Media Works, Sai Dharam Tej, Shobu Yarlagadda, Web Series-Movie

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న రెజీనా.ఎస్ఎంఎస్ సినిమా ద్వారా తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయం అయింది.ఇక ఆ తర్వాత కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం సినిమా లో నటించగా తన నటనకు అవార్డు కూడా అందింది.

తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో కూడా నటించింది రెజీనా.ఇక 2018 లో ‘అ!’ సినిమా లో చివరిసారిగా నటించగా.ఆ తర్వాత మళ్లీ ఎటువంటి అవకాశాలు అందుకోలేదు.ఇక సోషల్ మీడియాలో రెజీనా బాగా ఆసక్తి చూపుతుంది.

అంతే కాకుండా కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది.ఇక బాహుబలి నిర్మాతలు ప్లాన్ చేస్తున్న వెబ్ సిరీస్ లో రెజీనా ఎంతవరకు నటిస్తుందో చూడాలి.

ఇక ఈ సిరీస్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

#ReginaCasandra #Baahubali #Devineni Prasad #Regina #ReginaCasandra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు