క్రేజీ వెబ్ సిరీస్ లో ఛాన్స్ కొట్టేసిన రెజీనా

ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన తమిళ్ పొన్ను రెజీనా కాసాండ్రా.ఈ అమ్మడు మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకుండా తరువాత మెల్లగా అడుగులు వేసుకుంటూ యువ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది.

 Regina Casandra Got Crazy Web Series Offier In Hindi-TeluguStop.com

సందీప్ కిషన్ తో వరుస సినిమాలు చేసి ఫ్రేమ్ లోకి వచ్చింది.తఃరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో రెండు సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

డాన్స్ లో కూడా సత్తా చాటింది.అలాగే గ్లామర్ షోలో కూడా ఒకే అనిపించుకుంది.

 Regina Casandra Got Crazy Web Series Offier In Hindi-క్రేజీ వెబ్ సిరీస్ లో ఛాన్స్ కొట్టేసిన రెజీనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాల తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని అందరూ భావించారు.అయితే ఊహించని విధంగా రేస్ లో వెనకబడిపోయింది.

అడపాదడపా సినిమాలు చేసి మెప్పిస్తున్న పెద్దగా బ్రేక్ అయితే రావడం లేదు.ఇక సెవెన్, ఎవరు, చక్ర సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి రెజీనా మెప్పించింది.

అయినా కూడా తెలుగులో అనుకున్న స్థాయిలో ఈ అమ్మడుకి గుర్తింపు రావడం లేదు.అయితే ప్రస్తుతం సుదీర్ వర్మ దర్శకత్వంలో కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ సినిమాలో లీడ్ రోల్ లో కన్ఫర్మ్ అయ్యింది.

అలాగే మాతృభాష కోలీవుడ్ లో కూడా ఓ రెండు సినిమాలు చేస్తుంది.ఒక అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఏకంగా రా ఆఫీసర్ గా రెజీనా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ లో అవకాశం సొంతం చేసుకుంది.ఇండియన్ స్పేస్ సైంటిస్ట్స్ కథలతో రాకెట్ బాయ్స్ టైటిల్ తో వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.

ఇందులో విక్రమ్ సారాభాయ్, హోమీబాబా, అబ్దుల్ కలాం లాంటి సైంటిస్ట్ ల కథని చెప్పనున్నారు.ఈ వెబ్ సిరీస్ లో రెజినా కూడా అవకాశం సొంతం చేసుకుంది.

బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో స్పేస్ కాన్సెప్ట్ లతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తూ ఉండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది.అయితే రెజీనా ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది.

#ReginaCasandra #Regina Casandra #Hindi #RocketBoys #ReginaKorean

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు