కొరియన్ రీమేక్‌లో టాలీవుడ్ పాపలు  

Regina And Nivetha To Act In Korean Remake Movie - Telugu Korean Remake, Nivetha Thomas, Regina Cassandra, Telugu Movie, Telugu News

టాలీవుడ్‌లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన రెజీనా కాసాండ్రా మరియు నివేదా ధామస్ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన వీరు పలు హిట్ సినిమాలలో నటించారు.

Regina And Nivetha To Act In Korean Remake Movie

తమదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీలు కలిసి తాజాగా ఓ కొరియన్ రీమేక్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు.

ఇటీవల సమంత నటించిన ఓ బేబీ కూడా కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ అనే విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాతో సమంత హిట్ కొట్టింది.ఇప్పుడు ఇదే ఫార్ములాను ఓ బేబీ నిర్మాతలు సురేష్ బాబు, సునీత తాటి తాజాగా మరో కొరియన్ సూపర్ హిట్ మూవీ అయిన ‘మిడ్‌నైట్ రన్నర్స్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చిత్ర యూనిట్.

ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా కొరియన్ చిత్రాల రీమేక్‌కు కేరాఫ్‌గా టాలీవుడ్ మారనుందనే మాట మాత్రం వాస్తవం అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఈ సినిమాతో రెజీనా, నివేధా థామస్‌లు తెలుగులో మరో సక్సె్స్‌ను అందుకోవడం ఖాయమని అంటున్నాయి సినిమా వర్గాలు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Regina And Nivetha To Act In Korean Remake Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test