ఆరోగ్యంగా లేమని చెప్పటానికి సూచనలు     2017-09-24   21:38:08  IST  Lakshmi P

-

-

సాదారణంగా మనం ఆరోగ్యకరముగా,ఆకర్షణీయముగా,స్లిమ్ గా ఉండాలని కోరుకోవటం సహజమే. కానీ అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటానికి ఇష్టపడం. కానీ మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మన శరీరం ఇచ్చే స్పందనలను అర్ధం చేసుకోవటం ముఖ్యం. మన శరీరం ఇచ్చిన ప్రతి సూచనను అర్ధం చేసుకొని ఆరోగ్యకరంగా మారాలి.

1. నిద్ర లేకపోవడం
మన జీవితంలో నిద్ర అనేది ఒక ముఖ్యమైన బాగం. అటువంటి నిద్ర మనకు సరిగ్గా లేకపోతే మన శరీరం ఫిట్ గా లేదని అర్ధం చేసుకోవాలి.మనం నిద్ర పోయినప్పుడు మన శరీరంలో అవయవాలు అన్ని సహజంగానే శుభ్రం మరియు శుద్ది అవుతాయి. నిద్ర లేకపోవడం వలన నిద్రలేమి, మానసిక ఆందోళన, మగత, వికారం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్ర తగినంత ఉండేలా చూసుకోవటం ముఖ్యం. నిద్ర సరిగ్గా పట్టకపోతే, రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలను త్రాగితే నిద్ర బాగా పడుతుంది.

2. శక్తి లేకపోవడం
మన శరీరంలో అన్ని కార్యకలాపాల నిర్వహణ సరిగ్గా జరగాలంటే శక్తి అవసరం. శక్తి అనేది కొవ్వు ఆహారాలను తీసుకోవటం ద్వారా వస్తుంది. అయితే మనలో చాలా మంది బరువు కోల్పోయే ప్రక్రియలో కొవ్వు ఆహారాలను తీసుకోవటం పూర్తిగా మానేస్తున్నారు. కానీ శరీరంలో అన్ని కార్యకలాపాలు సరిగ్గా జరగాలంటే కొవ్వు అవసరమని గుర్తుంచుకోవాలి. బద్ధకం,మగత అనుభూతి ఉంటే కనుక శక్తి లోపించిందని అర్ధం చేసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటేనే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

3. తలనొప్పి మరియు ఒళ్ళు నొప్పులు
తలనొప్పి మరియు ఒళ్ళు నొప్పులు రావటానికి అనేక కారణాలు ఉంటాయి. వీటికి కారణాలు ఏమైనా, ఈ సమస్యలు ఉంటే మాత్రం ఆరోగ్యంగా లేమని అర్ధం. పనిలో ఒత్తిడి, విశ్రాంతి లేకుండా పని చేయటం, కళ్ళకు విశ్రాంతి లేకుండా ఉండటం, భారీ శబ్దాలు మరియు
ఒత్తిడి వంటి కారణాల వలన తలనొప్పి మరియు ఒళ్ళు నొప్పులు వస్తాయి.

4. ఊబకాయం
అధిక బరువు ఉన్నామంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా లేమనే అర్ధం. ఊబకాయం అనేది అధిక బరువు యొక్క ఒక లక్షణం. మన ఆహారంలో మార్పులు చేసుకోవటం మరియు వ్యాయామం చేయటం వలన ఊబకాయంను తగ్గించుకోవచ్చు. జీవితంలో ఒకసారి ఊబకాయం వచ్చిందంటే తగ్గించుకోవటం కష్టం. అలాగే దీనితో పాటు అనేక వ్యాధులు దాడి చేస్తాయి.

5. అలసట
అలసట అనేది అనారోగ్య కారణాల వలన సంభవిస్తుంది. మన శరీరం తగినంత ఆరోగ్యంగా లేకపోతే, ఏ పని మీద శ్రద్ద ఉండకపోవటంతో పాటు చాలా తొందరగా అలసట అనుభూతి కలుగుతుంది. ఇది ఆరోగ్యంగా లేమని చెప్పటానికి ఒక సంకేతం.