పాపం రీమా సేన్.. ఆ ఒక్క పని మళ్ళీ మళ్ళీ చెయ్యలేక సినిమాలు వదిలి పారిపోయింది?

Reema Sen Ran Away From Movies Unable To Do That One Thing Again And Again

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక హోదాను సంపాదించుకుంటే ఎంత గౌరవం ఉంటుందో అదే హోదా కోల్పోతే ఆ గౌరవం కూడా పోతుంది.అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవడంతో కూడా నటీనటులు గౌరవం అందుకోలేకపోతారు.

 Reema Sen Ran Away From Movies Unable To Do That One Thing Again And Again-TeluguStop.com

దాంతో సినిమాలలో అవకాశాలు కూడా కోల్పోతారు.హీరోయిన్ల విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

చాలావరకు హీరోయిన్ లను దర్శక నిర్మాతలు ఒక ఆటబొమ్మగా చూస్తారు.వాళ్ళు ఎలా చెబితే హీరోయిన్లు అలా చేస్తేనే వాళ్లకు మళ్లీ అవకాశాలు ఇస్తుంటారు.లేదంటే మరో అవకాశం రాకుండా చేస్తుంటారు.ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ లు దర్శకులు చెప్పింది వినకపోయేసరికి తమ కెరీర్ ను వదిలేసుకున్నారు.

 Reema Sen Ran Away From Movies Unable To Do That One Thing Again And Again-పాపం రీమా సేన్.. ఆ ఒక్క పని మళ్ళీ మళ్ళీ చెయ్యలేక సినిమాలు వదిలి పారిపోయింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే రీమాసేన్ కూడా ఇటువంటి ఫోర్స్ వల్లే సినిమాలు వదిలి పారిపోయింది.ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

చిత్రం సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది రీమాసేన్.ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమాలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత బావ నచ్చాడు, సీమ సింహం, అదృష్టం, వీడే, నీతో వస్తా, నీ మనసు నాకు తెలుసు, బంగారం, యమగోల మళ్ళీ మొదలైంది వంటి పలు సినిమాలలో నటించింది.

తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మరాఠీ భాషలలో కూడా నటించింది.

కానీ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీని వదిలేసింది.పైగా కొన్ని సినిమాలు తనను నిరాశపరిచాయి.

ఆ తర్వాత 2012లో శివ కరణ్ సింగ్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయింది.పెళ్లి తర్వాత కూడా సినిమాలలో అడుగు పెట్టలేదు.

ఇక ఈమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

Telugu Directors, Exposing, Film Industry, Heroine, Manasantha Nuvve, Movies, Reema Sen, Reema Sen Movies, Reema Sen Tollywood Re Entry, Reema Sen Yuganiki Okkadu, Tollywood-Movie

ప్రస్తుతం ఈమె ఫారెన్ లో ఉంటుంది.ఇదిలా ఉంటే గతంలో ఈమె సినిమాలు వదులుకోవడానికి మరో కారణమని తెలిసింది.రీమాసేన్ యుగానికి ఒక్కడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఈమె చాలా వరకు ఎక్స్ పోజింగ్ చేసింది.ఇక ఈ సినిమా తర్వాత ఎన్నో అవకాశాలు కూడా అందుకుంది.

కానీ తాను ఆసక్తి చూపలేకపోయింది.

కారణం తనకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు యుగానికి ఒక్కడు సినిమాలో చేసిన ఎక్స్ పోజింగ్ చేయాలని బాగా బలవంతం చేశారట.

ఇక రీమాసేన్ తను నటించిన యుగానికి ఒక్కడు సినిమా చారిత్రాత్మక నేపథ్యంలోనిది అంటూ అందుకే అందులో అలా చేయాల్సి వచ్చిందని చెప్పినా కూడా ఆ దర్శక నిర్మాతలు వినలేదట.పైగా మొహమాటం లేకుండా ప్రేక్షకుల కోసం ఎక్స్ పోజింగ్ చేయాలని బాగా ఫోర్స్ చేశారట.

Telugu Directors, Exposing, Film Industry, Heroine, Manasantha Nuvve, Movies, Reema Sen, Reema Sen Movies, Reema Sen Tollywood Re Entry, Reema Sen Yuganiki Okkadu, Tollywood-Movie

దీంతో రీమాసేన్ అలా చేయడం తన వల్ల కాదని సినిమాలనే వదులుకుందట.ఇక ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అభిమానులు ఉన్నారు.సినీ ఇండస్ట్రీకి దూరమైన కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, ఫ్యామిలీ ఫోటో లను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.

ఇక రీమాసేన్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు.

#Reema #Directors #Reema #ReemaYuganiki

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube