కాంగ్రెస్ లో తగ్గిన హడావిడి...ఒంటరి పోరాటం చేస్తున్న రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.టీఆర్ఎస్ పార్టీ తరువాత రెండో ప్రత్యామ్నాయ పార్టీగా మారాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్న తరుణంలో కాంగ్రెస్ లో అంతర్గత పోరు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది.

 Reduced Rush In Congress   Rewanth Is Fighting Alone , Telangana Politics, Revan-TeluguStop.com

టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారడం అనేది అంత సులభమైన విషయం కాదు.ఎందుకంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాజకీయ నాయకులలో కేసీఆర్ ను మించిన రాజకీయ వ్యూహకర్త లేరన్న విషయం తెలిసిందే.

అయితే ఇంకా రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా పూర్తి స్థాయిలో సమరానికి సిద్ధం కానట్టు తెలుస్తోంది.

ఇంకా నేతల మధ్య ఐక్యత అనేది పూర్తి స్థాయిలో రాకపోవడంతో రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్ గా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది.

అసలే కాంగ్రెస్ పై కేసీఅరవింద్ కు అత్యంత చులకన భావం అనేది ఉన్న తరుణంలో కేసీఆర్ స్పందించేలా చేయాలంటే రేవంత్ కు తోడు మరిన్ని కాంగ్రెస్ గొంతుకలు కలిస్తేనే అది సాధ్యం.అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటంతో కాంగ్రెస్ లో హడావిడి తగ్గిపోయిందని ఇక వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటే అవకాశం లేదని కాంగ్రెస్ పై ఒకరకమైన చర్చ సాగుతోంది.

మరి రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం కాంగ్రెస్ ను ఎంత వరకు విజయతీరాలకు చేరుస్తుందనేది చూడాల్సి ఉంది.అయితే పార్టీకి లాభం జరిగే విధంగా వ్యవహరించని నేతలపై రేవంత్ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని రేవంత్ భావిస్తున్నారట.

లేకపోతే పార్టీ ఓటమికి రేవంత్ ఒక్కడే బాధ్యుడు అనే భావన ఏర్పడే ప్రమాదం ఉండటంతో పాటి తన రాజకీయ భవిష్యత్తుకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube