ఈ సింపుల్ స్టెప్స్‌తో ఈఎంఐ భారాన్ని తగ్గించుకోండి..!

ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచిన తర్వాత రుణాల తీసుకున్న వారిపై అదనపు భారం పడుతోంది.రుణాల వడ్డీ రేట్లు పెరగడంతో ఈఎంఐలు అధికమయ్యాయి.

 Reduce Emi Burden With These Simple Steps  , Emi ,  Repo Rate , Rbi, Key Decisi-TeluguStop.com

ద్రవ్యోల్బణం ఇప్పట్లో నియంత్రణలోకి రాదని, దీనివల్ల ఆర్‌బీఐ మరోసారి రెపోరేటును పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఇదే జరిగితే రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయి.

ఫలితంగా సామాన్యులపై వడ్డీ భారం పెరగవచ్చు.సామాన్యులకు ఈఎంఐలు చెల్లించడం కష్టంగా కూడా అనిపించవచ్చు.

ఈ రోజుల్లో అన్ని వస్తువుల ధరలే కాదు దానికితోడు వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణులు సామాన్యులకు కొన్ని ఫైనాన్షియల్ టిప్స్ పాటించాలని సలహా ఇస్తున్నారు.

ఈ టిప్స్ ఫాలో అవడం ద్వారా పెరిగే వడ్డీరేట్ల ప్రభావం సామాన్యులపై పడదని పేర్కొంటున్నారు.మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వడ్డీ పెరిగినప్పుడు ఈఎంఐ కోసం మీరు అదనంగా కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు వెచ్చించాల్సి వస్తుంది.మీ అదనపు డబ్బును మీరు మీ మంత్లీ ఖర్చులను తగ్గించుకొని సేవ్ చేసుకోవచ్చు.

ఉదాహరణకి మీరు అనవసరంగా కొన్ని ఖర్చులు పెడుతుంటే వాటిని ఆపేయాలి.అలా మిగుల్చుకున్న డబ్బును ఈఎంఐలకు చెల్లిస్తే ఏలాంటి భారం అనిపించదు.

Telugu Financial Tips, Key, Latest, Repo, Tips-Latest News - Telugu

కొన్ని బ్యాంకులు ఈఎంఐలు పెంచకుండా కాలవ్యవధిని పెంచుతాయి.దీనివల్ల మీరు ఎక్కువ కాలం పాటు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.ఇలాంటప్పుడు మీరు అదనంగా ఈఎంఐలు చెల్లించి ముందస్తుగా నిర్ణయించిన కాలవ్యవధిలోనే అప్పును తీర్చేయవచ్చు.లేదా తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులకు మీ రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు.

అలాగే ఆకర్షణీయమైన పథకాల్లో పెట్టుబడి పెట్టి రాబడి పొందొచ్చు.ఆ రాబడిని అప్పుల వడ్డీని చెల్లించేందుకు ఉపయోగించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube